ప్రపంచంలో రాబోయే రోజుల్లో మత రాజ్యస్థాపనే లక్ష్యంగా క్రిస్టియన్లు, ముస్లింలు మధ్య ఘర్షణలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఇస్లాం రాజ్య స్థాపన అంటు కొన్ని దేశాల్లోని కొంతమంది ప్రయత్నిస్తుంటే దాని అడ్డుకోవడానికి క్రిస్టియన్లు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.  ప్రస్తుతం లెబనాన్ లో కూడా  ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది.


శరణార్థులుగా వచ్చినటువంటి పాలస్తీనాకు చెందినటువంటి వారు ప్రస్తుతం లేబనాల్లో ఇస్లాం మత సామ్రాజ్యాన్ని స్థాపించాలని తమ మత ఆధిపత్యం ఉన్న రాజ్యం కావాలని సైన్యంతో పోరాటాలు చేస్తున్నారు. వారికి శరణార్థులుగా ఉండడానికి ఆశ్రయం కల్పించిన వారిపైనే దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం లెబనాన్లో ఆర్మీకి పాలస్తీనా కు సంబంధించిన వ్యతిరేక వర్గానికి జరిగిన దాడుల్లో దాదాపు ఐదుగురు చనిపోయారు. దీనికి ప్రధాన కారణం  ఉగ్రవాది మహమ్మద్ ఖలీల్ అని తెలుస్తుంది.


ఇతడి లక్ష్యం లెబనాన్ లో మత రాజ్య స్థాపన తేవాలని కానీ దానికి లెబనాన్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో అక్కడ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పాలస్తీనాకు ఇజ్రాయిల్ కు మధ్య గొడవలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.  పాలస్తీనా జెరుసలెం సంబంధించి ఇజ్రాయిల్ కు ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయి.  తమ దేశాన్ని  కాపాడుకోవడానికి ఇప్పుడు లెబనాన్ నడుం బిగించింది. తమ దేశంలో శరణార్థులుగా వచ్చిన వారిని ఏమీ అనకుండా ఉండడం వల్ల వారితోనే అంతర్గతంగా పోరాడాల్సిన పరిస్థితి తలెత్తిందని భావిస్తుంది.


లెబనాన్ పాలస్తీనా శరణార్థులకు ఎలాంటి హక్కులు ఉండవు. కానీ అక్కడే మత రాజ్య స్థాపన చేయాలని పాలస్తీనా ప్రయత్నించడం దారుణం దీంతో ఘర్షణలు చెలరేగుతున్నాయి ఈ ఘర్షణలను లేవనాన్ని ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేస్తుంది. మొత్తం మీద శరణార్థులుగా వచ్చిన పాలస్తీనా వారితో లెబనాన్ పోరాడుతున్న విధానం చూస్తుంటే ఆ దేశం చిక్కుల్లో పడ్డట్టే అనిపిస్తుంది కానీ తమ దేశ రక్షణ కోసం ఇలాంటి ప్రయత్నాలను తప్పకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR