యూరప్, నాటో దేశాలు అమెరికా చెప్పినట్లు వింటాయని అందరూ అనుకుంటారు. కానీ కొన్ని సందర్బాల్లో అవి అగ్రరాజ్యానికే షాక్ ఇస్తుంటాయి. హంగేరీ, బ్రెజిల్, లాంటి దేశాలు అమెరికా చెప్పినా ప్రస్తుతం దాని మాట వినడం లేదు. ఇప్పుడు యూరప్ దేశం అయినటువంటి ఈజిప్టు కూడా అమెరికా మాట వినడం లేదు. అమెరికా మాత్రం అన్ని దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు పంపాలని ఆదేవించారు.


అయితే ఆయా దేశాల్లో పౌరులు, నాయకులు మాత్రం ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ఆయుధాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీని వల్ల తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు.. ఇక్కడ జరుగుతున్న తంతు ఏమిటంటే ఈజిప్టు కూడా అమెరికా ఆయుధాలు ఇవ్వాలని చెప్పింది. దీనికి ఈజిప్టు దేశం అమెరికాకు కరాఖండిగా చెప్పేసింది. ఆయుధాలు ఉక్రెయిన్ ఇవ్వమని తేల్చేసింది. గతంలో స్విట్జర్లాండ్ కూడా ఇవ్వమని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో అన్ని దేశాలు శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవాలని అనుకోవడం లేదు.


కానీ అమెరికా ఆయా దేశాలను బెదిరించి మరీ ఆయుధాలు ఇచ్చేలా చేస్తోంది. కొన్ని దేశాలు అమెరికా చెబితే వినకపోతే దాని నుంచి ఏదైనా ముప్పు వచ్చే అవకాశం ఉంటుందని భావించి తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చాయి. దీంతో ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాయి. అటు రష్యాతో వైరం పెరిగిపోయింది. అసలేమాత్రం సంబంధం లేని యుద్దంలో రష్యాతో వైఖరి తెచ్చుకోవడం కొన్ని దేశాలు ఇష్టపడటం లేదు.


అయినా అమెరికా మాత్రం ఆయుధాలు ఇవ్వాలని ఆయా దేశాలను బలవంతం చేస్తోంది. దీనికి ఇప్పుడు కొన్ని దేశాలు ససేమిరా అంటున్నాయి. దీంతో అమెరికా కంగు తినాల్సిన పరిస్థితి. అగ్రరాజ్యం ఆధిపత్యం నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో జరుగుతున్నదే రష్యా ఉక్రెయిన్ యుద్ధమని ఇప్పటికే చాలామంది మేధావులు పేర్కొన్నారు. కానీ అమెరికా మాత్రం ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని ప్రకటిస్తూ మభ్యపెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: