పాకిస్థాన్, ఇండియాకు ఒక్క రోజు తేడాలో స్వాతంత్య్రం వచ్చింది. కానీ పాక్ అప్పుల్లో కూరుకుపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతోంది. కనీసం తినడానికి గోధుమ పిండి దొరక్క, పెట్రోల్, డిజీల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి.. ఆదాయ మార్గాలు మూసుకుపోయి దిక్కులేని దేశంగా తయారయింది. వివిధ దేశాలు, ప్రపంచ బ్యాంకు వద్ద తీసుకున్న అప్పును చెల్లించలేక కొత్త అప్పులు ఎలా తీసుకోవాలో తెలియక దేశ పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయి.


కానీ 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతవనిలో ఇండియా మాత్రం ప్రపంచంలోనే టాప్ 5 ఆర్ఠిక వ్యవస్థలో ఒకటిగా నిలిచి అబ్బురపరుస్తోంది.  దాదాపు 142 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి అయిదో స్థానంలో ఆర్థికంగా నిలిచింది. ఇది నిజంగా ప్రశంసించదగినదే.. దేశంలో ఉన్న దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలను అందజేస్తుంది.


ప్రస్తుతం అమెరికాతో పోటీ పడుతుంది. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, ఇలా అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది. నూతన పెట్టుబడులను ఆకర్షిస్తూ అన్ని రంగాల్లో మెరుగ్గా రాణిస్తోంది. షేర్ మార్కెట్ ను సైతం కూల్చాలని చాలా మంది ప్రయత్నాలు చేసిన దృఢమైన ఆర్థిక వ్యవస్థ ముందు వారి పన్నాగం కూడా విఫలమైంది. ఇలా దేశంలో ఉన్న అందరికీ విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు చేరవేస్తూనే ప్రజల నాడీ తెలుసుకుని ముందుకు సాగుతుంది.


కానీ దాదాపు ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందిన పాక్ మాత్రం సైన్యం, ఐఎస్ తదితర సంస్థల చేతుల్లో చిక్కుకుని విలావిల్లాడుతోంది. పాక్ లో ఉగ్రదాడులు పెరిగిపోయాయి. మత ప్రాతిపదికన విడిపోయిన దేశంలో ఎక్కువ డెవలప్ జరగాలి కానీ అదేమీ కాలేదు. కేవలం దేశంలో జరగాల్సిన డెవలప్  మరిచి మత పిచ్చితో దేశాన్ని నాశనం చేసుకున్నారు. భారత్ మాత్రం ఆర్థికంగా ముందుకు సాగుతుంటే పాక్ అప్పుల ఊబిలో కూరుకుపోయి దీనస్థితికి చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: