భారతీయ జనతా పార్టీ జాతీయ అధికారి అయినటువంటి సయ్యద్ జాఫర్ కవిత పై చేసిన వ్యాఖ్య ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. ఆయన తాజాగా తెలంగాణలో మాట్లాడుతూ కవిత ఎప్పుడైనా అరెస్టు అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారట. అయితే ఈ మాటను పోలీసులో, సిఐడినో ఈడినో చెప్పలేదు. అయితే ఈ దర్యాప్తు సంస్థలన్నీ కేవలం విచారణ మాత్రమే చేస్తాయి గాని ఇలా మాట్లాడవు అంటున్నారు.


అయితే కవిత అరెస్టు గురించి  ఈ సయ్యద్ జాఫర్ మాట్లాడడంతో ఈయన ఏమైనా సిఐడినా, లేక ఈడి నా లేక ఢిల్లీకి సంబంధించిన పోలీస్ యంత్రాంగమా అని వాపోతున్నారు కొంత మంది. సిఐడి, సిబిఐ అలాగే ఈ డి లాంటి దర్యాప్తు సంస్థలు కూడా మీడియాలో ఇలా  చెప్పడం  జరగదు. వాళ్లు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక పేపర్ స్టేట్మెంట్ ద్వారానే ఎక్కువగా తమ దర్యాప్తుకు సంబంధించిన వివరాలను చెప్తుంటారు.


అయితే ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థలు అందరూ చేసే పనిని ఈ  భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా వకాల్తా తీసుకుని చేస్తున్నారా అని అడుగుతున్నారు కొంత మంది. పోనీ వాళ్లు తమ పార్టీకి చేయాల్సిన  పని అయినా చేస్తున్నారా అంటే లేదని తెలుస్తుంది. మొన్న ఆల్రెడీ పార్టీలో బలంగా ఉన్న కిషన్ రెడ్డిని, అలాగే బండి సంజయ్ ని కూడా పక్కన పెట్టేసి కొత్తగా ఇంకెవరో పార్టీలోకి వస్తారని ఎదురు చూస్తున్నారు.


కానీ  భారతీయ జనతా పార్టీనే  కవితను తొక్కేస్తుంది అని చెప్పుకోవడానికి కేసీఆర్ కి అవకాశం ఇచ్చిన వాళ్ళవుతున్నారు ఇన్ డైరెక్ట్ గా.  ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీని కేసిఆర్ కు  లోకువ చేస్తున్నారు అంటున్నారు మరి కొంత మంది. దర్యాప్తు సంస్థలు చేయాల్సిన పనులు కావాలని మా మీద మా కుటుంబం మీద కక్షతో బిజెపి నాయకులు చేస్తున్నారని కెసిఆర్ అనుకునే అవకాశం కూడా ఉంది వీళ్ళ వల్ల.

మరింత సమాచారం తెలుసుకోండి: