సోల్జర్స్ టీ తాగడం, టిఫిన్ చేయడం, డాన్స్ చేయడం లాంటివి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అసలైన ఇబ్బంది తలెత్తుతుంది. ఇంతదానికే కేంద్రం ఇలా రాద్దాంతం ఎందుకు చేస్తుందని అంటున్నారు. అత్యాధునిక యుగం కాబట్టి ఏరియాను ఐడింటిఫై చేసి వారి మీద దాడికి ఫ్లాన్ చేసే అవకాశముంది. ఇంత దానికే ఇలా ఎలా చేస్తారని అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. డ్రోన్ ఎటాక్ లు జరుగుతున్నాయి. శత్రు దేశం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దాడి చేయాలనే ఫ్లాన్ లోనే ఉంటుంది.
వీటిని చూసి అమ్మాయిల పేరుతో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తున్నారు. తర్వాత బ్లాక్ మెయిల్ చేసి హానీ ట్రాప్ లో పడేస్తున్నారు. చిన్న రహస్యం చెప్పినా ఇక వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇలా ఇప్పటికే హనీ ట్రాప్ పడి చాలా మంది సైనికులు పట్టుబడ్డారు. దేశ రహస్యాలు కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కాబట్టి సోషల్ మీడియాలో పర్సనల్ డిటైల్స్ కానీ రీల్స్ చేయడం లాంటివి చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు కేంద్రం ఇచ్చింది. ఇండియాలో ఉన్న ఆర్మీ, నేవీ ఇతర భద్రతా బలగాలకు చెందిన అధికారులు ఈ ఆదేశాలు తప్పకుండా పాటించాలని ఆయా డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులు కూడా ఆదేశాలిచ్చారు.