ప్రపంచంపై గుత్తాధిపత్యం ప్రదర్శించడానికి చైనా, అమెరికా పోటీపడుతూ ఉంటాయి.  మెజార్టీ దేశాలు తమ చెప్పుచేతల్లో ఉండేలా చూసుకుంటాయి. ప్రపంచ దేశాలన్నీ తమపై ఆధారపడాలని ఈ రెండు దేశాలు భావిస్తూ ఉంటాయి. అందుకనుగుణంగా ఇతర దేశాల్లోని బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకొని వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి.


భారత్ సరిహద్దు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలన్నింటికి చైనా అప్పులిస్తూ ఉంటుంది.  తద్వారా ఆయా దేశాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటుంది.  మన మిత్ర పక్షమైన శ్రీలంక కు స్నేహ హస్తం చాటి భారత్, లంక మధ్య ఉన్న సత్సంబంధాన్ని దెబ్బ తీయాలని చూసింది. ఈ ఎత్తుగడలు ప్రతిగా భారత్ చైనా సరిహద్దు దేశాలైన తైవాన్, ఫిలిఫ్ఫీన్స్, వియత్నాం తో సత్పంబంధాలు కొనసాగిస్తున్నాం.


ఆర్థిక విషయాలు, ఆయుధాలు పరంగా ఆయా దేశాలతో సఖ్యంగా ఉంటాం మినహా ఆ దేశ రాజకీయ వ్యవహారాల్లో మనం తలదూర్చం.  చైనా కి కొన్ని విషయాల్లో ఫిలిఫ్ఫీన్స్ అడ్డుపడుతోంది. దీంతో ఆ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకొని తమ దేశానికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని గెలిపించుకుంది. దాని పర్యావసానం చైనాకు దగ్గరలో ఉన్న మన మిత్ర దేశం క్రమంగా వాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది.


ఇప్పుడు మాల్దీవుల విషయానికొస్తే ఈ ద్వీప కల్పం భారత్ కు దక్షిణాసియాలోనే అతి కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం.  గతంలో అధికారంలో ఉన్న మహమ్మద్ సోలిహ్ మన దేశంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాడు. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన మహ్మద్ మయిజూ చైనా మద్దతుదారుడు.  చైనా అండదండలతోనే ఎన్నికల్లో విజయం సాధించాడు. తాను గెలిస్తే భారత సైన్యాన్ని వెనక్కి పంపిస్తానని ఇండియాపై ఆధారపడటం తగ్గిస్తాననే నినాదంతో గెలిచాడు. ఈ పరిస్థితులు భారత్, చైనా సంబంధాల మధ్య ఎలాంటి కొత్త పరిణామాలు సృష్టిస్తోందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: