హమాస్ తీవ్రవాదులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు.  ఆసుప్రతులనే సైనిక స్థావరాలుగా ఏర్పాటు చేసుకొని.. ఇజ్రాయెల్ సైన్యం దాడి చేస్తే ఆసుపత్రి పై దాడి చేశారని ప్రపంచానికి చూపిస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా గాజాలోని ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టటం లేదు.  అనుమానం ఉన్న ప్రతి చోటా బాంబులతో విరుచుకుపడుతోంది. అది ఆసుపత్రి అయినా.. శరణార్థ శిబిరం అయినా సమీపంలో బాంబుల వర్షం కురిపిస్తోంది.


గాజాలోనే అతి పెద్దదైన అల్ షిఫా ఆసుపత్రి సమీపంలో భారీగా దాడులు చేసింది. ఆసుపత్రి నిండా రోగులతో సురక్షితమన్న భావనతో వేలాది మంది పాలస్తీనా వాసులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే వీటి కింద ఉన్న సొరంగాల్లో హమాస్ మిలిటెంట్లు ఉన్నారని అందుకే దాడులు చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది.  హమాస్ స్థావరాలు, రహస్య సొరంగాలను నేలమట్టం చేయడమే తన ధ్యేయ మని చెబుతోంది.


ఈ క్రమంలో భూతల, వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడులు పాలస్తీనా లోని సాధారణ ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయి.  ఇజ్రాయెల్ దళాలు గాజాలోకి అడుగు పెట్టాయి. 24గంటల్లో 600 హమాస్ స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.  మిలిటెంట్ల ఆచూకీ కోసం అణువణువు గాలిస్తున్నామని తెలిపింది. ఉత్తర, దక్షిణ గాజాను అనుసంధానించే ప్రధాన జాతీయ రహదారిని ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించింది.  ఈ రహదారిపై వాహన రాకపోకలను ఆ సైన్యం అడ్డుకుంటోంది.  దీనికి కారణాలు మాత్రం వెల్లడించడం లేదు.


దీంతో ప్రజలు ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వెళ్ల లేకపోతున్నారు. దాడులు చేస్తున్నా ఇజ్రాయెల్ సైన్యాన్ని గట్టిగానే ప్రతి ఘటిస్తున్నామని హమాస్ చెబుతోంది.  గాజాలోని ఇజ్రాయెల్ దాడులో దాదాపు 400మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే హమాస్ గ్రూపును తుద ముట్టించడానికి తమకు మరింత సమయం పడుతుందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరణాల సంఖ్యను పెంచి పాలస్తీనా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: