అక్టోబరు 7న గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లోకి చొరబడి ప్రజలను ఊచకోత కోశారు. మరణించిన వారిలో పండుముసలి నుంచి పసిపిల్లల వరకు అన్ని వర్గాల వారు ఉన్నారు. ఈ దాడిలో సుమారు 1400మంది మరణించారు. మరో 200మందిని గాజాలోకి బందీలుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ వరుసగా గాజాపై దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో మరణాల సంఖ్య 7000 దాటింది. ఉగ్రవాదులతో సహా పాలస్తీనా పౌరులు కూడా మరణిస్తున్నారు.


అయితే చాలామంది పాలస్తీనా వేరు హమాస్ వేరు.. హమాస్ తీవ్రవాదులు చేసిన దాడులకు అమాయకులైన పాలస్తీనా ప్రజలు బలవుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  ఉదాహరణకు మన దగ్గర నక్సలైట్లు, తీవ్రవాదులు దాడులు చేస్తున్నారు.  వీళ్లు మన దేశ పౌరులే కాబట్టి క్షమించి వదిలేయాలా.. లేక వారిపై చర్యలు తీసుకోవాలా.. ఇప్పుడు పాలస్తీనాలో జరుగుతుంది అదే.  హమాస్ తీవ్రవాదులు పాలస్తీనా నడిబొడ్డున ఉన్న గాజాలో ఉంటే వారిపై చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తున్నారు.  ఇది ఆ దేశం చేసుకున్న స్వయంకృతాపరాధమే.


ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై భారత్ లో భిన్న వాదనలు ఉన్నాయి. కొంతమంది ఇజ్రాయెల్ కి మద్దతుగా మరకొంత మంది పాలస్తీనా కి అనుకూలంగా మాట్లాడుతుంటారు.  చివరకి ప్రధాన పార్టీలు సైతం చెరొకరికి మద్దతిస్తున్నాయి. ఇటీవల దేశంలో పాలస్తీనాకి సంఘీభావంగా పలుచోట్ల ర్యాలీలు సైతం తీస్తున్నారు.


ఇప్పటికే కేరళలో జరిగిన పాలస్తీనా మద్దతు ర్యాలీ వివాదస్పదమైంది.  తాజాగా ఏపీలోకి కడప జిల్లాలో పాలస్తీనాకి అనుకూలంగా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా కొంతమంది ర్యాలీలు తీశారు. ముస్లింలను సంతోష పరచడానికి ఏపీలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతారని ఇటీవల కొంతమంది పేర్కొన్నారు. ముస్లిం ఓట్ల కోసం ఈ దేశాన్ని దోచుకున్న టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతానని చెప్పిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఏర్పాటు చేసినా చేస్తారు. మనం ఆ స్థాయికి ఎందుకు వెళ్తున్నామో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: