ప్రపంచంలో ప్రస్తుతం అశాంతి నెలకొంది ఏమో అనిపిస్తోంది. ఎందుకంటే దేశాల మధ్య సంఘర్షణలు పెరుగుతున్నాయి. పెద్దదవుతున్నాయి. రోజుకో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఏ దేశంపై ఎవరు దాడి చేస్తారో.. అర్థం కానీ పరిస్థితి నెలకొంది.  దేశాల మధ్య ఆధిపత్య పోరు కోసం అణు ఆయుధాలను పరీక్షించడం, ఇతర దేశాల మిస్సైల్స్ ని కూల్చేయడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ శాంతి నెలకొల్పాల్సిన ఐక్యరాజ్యసమితికి పరిమిత విధులు ఉండటంతో అగ్ర రాజ్యాలు ఆ సంస్థ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి.


ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధం రెండేళ్లకు పైగా సాగుతోంది. దీనికి ముగింపు ఇప్పట్లో ఉండేలా లేదు. ఇరు దేశాలు కూడా తమ ఆయుధాలను, సైనికులను కోల్పోతున్నాయి. భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవిస్తున్నాయి. వీటి అన్నింటిని తిరిగి పునర్నింర్మించాలంటే రెండు దేశాలకు శక్తికి మించిన పనే. మరోవైపు ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదులు చేశారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కాస్తా ఆ దేశం వర్సెస్ అరబ్ దేశాల మాదిరిగా తయారైంది. ఇప్పటికే గాజాలో అతి భయానిక పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధంలో వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమాన్ నెతన్యాహూ తేల్చి చెప్పారు. ఈ యుద్ధంలో అమాయకులైన చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు.


దీంతో పాటు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఎప్పుడు యుద్ధం సంభవిస్తుందో చెప్పలేని పరిస్థితి. మరోవైపు  చైనా, తైవాన్ మధ్య కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఇథియోపియా యుద్ధంలోకి దిగుతోందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు అబీ అహ్మద్ ఆఫ్రికా ప్రాంతంలో గొడవకు కారణం అవుతున్నారు. రెడ్ సీ ప్రాంతంలో పోర్టు పై ఆధిపత్యం కోసం ఎర్తీయాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఆర్థిక పరమైన ఘర్షణలు కాస్తా.. యుద్ధం వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆఫ్రికా ఖండంలో యుద్ధ సూచనలు కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: