
అదే సమయంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ లో ఉన్న ఫిలింసిటీలకు నోటీసులు పంపగానే ఆగమేఘాల మీద వచ్చి ఆయన ముందు వాలిపోయారు. అనంతరం సీఎం కేసీఆర్ భజన చేయడం ప్రారంభించారు. ఇలా ఒక్కొక్కరిపై ఒక్కో రకంగా అభిమానాన్ని చాటుతూ ఉంటారు. దీంతో వైఎస్ జగన్ అప్పట్లో సినిమా టికెట్ల రేట్లపై ఆంక్షలు విధించడంతో అందరూ ఒక్క సారిగా దిగివచ్చి ఆయనతో మాట్లాడాల్సి వచ్చింది.
ఆ సమయంలో సినీ ఇండస్ట్రీని నాశనం చేయాలని చూస్తున్నారన ఎల్లో మీడియా తెగ ప్రచారం చేసేసింది. సీఎం జగన్ సినిమా రంగంపై పగ బట్టారని ఇలా అయితే లక్షల మంది కార్మికులు, నటులు ఏమైపోవాలని విమర్శలు చేశారు. అయితే సినీ రంగానికి చెందిన చాలా మంది కేవలం కొంతమందిని మాత్రమే తమకు అనుకూలంగా మలుచుకుని వారు గెలిస్తేనే కలవడం లేకపోతే పట్టించుకోకపోవడంతో అందులో ఉన్న సెలబ్రెటీలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం దిల్ రాజు మినహా ఎవరూ వారిని పలకరించిన పాపాన పోలేదు. ఈ విషయాన్ని స్వయానా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమకు నచ్చని వారు సీఎంలు అయితే కనీసం విషెస్ కూడా చెప్పరా అంటూ సినీ ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు చేస్తున్నారు.