ఇజ్రాయిల్ పై అక్టోబర్ 7 న హమాస్ ఉగ్రవాదుల దాడుల తర్వాత గాజాలో ఇజ్రాయిల్ బాంబుల మోత మోగిస్తుంది. గాజాలో ఎన్నడూ చూడనంత బీభత్సాన్ని సృష్టిస్తుంది. కనివినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తూ టెర్రరిస్టులను ఏరి వేస్తుంది. గాజాలో మొన్నటి వరకు జరిపిన దాడుల్లో ఇజ్రాయిల్ సైన్యం వైట్ పాస్పరస్ బాంబులను ఉపయోగించిందని హమాస్ టెర్రరిస్టులు, పాలస్తీనా ప్రభుత్వం ఆరోపిస్తుంది.


వైట్ పాస్పరస్ అనేది చాలా దారుణమైన ఆయుధం. ఇది వెదజల్లే రేడియేషన్ వల్ల మానవులు ఎముకల గూడుగా మారిపోతారు. అణు బాంబు వేసిన మాదిరిగానే మనిషి శరీరం రోగ నిరోధర శక్తిని కోల్పోయి మనిషి జీవచ్ఛవంలా మారతాడు. ఇంతటి భయంకరమైన బాంబులను గాజాలో టెర్రరిస్టులను ఏరి వేసేందుకు ఇజ్రాయిల్ వాడుతుందని పాలస్తీనాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశమైన ఖతార్ కూడా ఆరోపిస్తుంది.


అయితే తాము అలాంటి బాంబు దాడులు చేయలేదని కావాలనే ఉగ్ర మూకలు ఆరోపిస్తున్నాయని ఇజ్రాయిల్ కొట్టి పారేసింది. హమాస్ ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా ఇజ్రాయిల్ భూతల దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలోని సొరంగాల్లో ఉన్న టెర్రరిస్టుల స్థావరాలను కనుగొని అక్కడ వాటిని ధ్వంసం చేస్తూ పోతుంది. దీని వల్ల హమాస్ పూర్తిగా క్షీణించిపోవాలని చూస్తుంది. గతంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు చెప్పిన విధంగా హమాస్ ను పురుగులా నలిపేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు అదే పంథాలో భూతల దాడులు చేస్తూ హమాస్ ను చావు దెబ్బ కొడుతున్నారు.


అయితే ఇదే సమయంలో హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయిల్ సైన్యానికి మధ్య గాజాలో భీకర పోరు కొనసాగుతుంది. ఇజ్రాయిల్ కు చెందిన 100 మంది సైనికులు సైతం చనిపోయినట్లు ఆ దేశం తెలిపింది. గాజాలో భూతల దాడుల సమయంలో హమాస్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయిల్ పోరాటం చేస్తుంది. ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటున్నా.. ఇజ్రాయిల్ మాత్రం యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: