రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుందని అమెరికా భావించింది. ముఖ్యంగా యూరప్ దేశాలు అమెరికా ఒక్కటే కావడంతో రష్యా పని ఇక అయిపోయిందని అంతా భావించారు. కానీ రష్యా తన తెలివిని ప్రదర్శించి తన ప్రధాన ఆదాయ వనరు అయినా ఆయిల్ ను భారత్, చైనా దేశాలకు అమ్మి సొమ్ము చేసుకుంది.


ఇక్కడ అమెరికా, ఇండియా ను కట్టడి చేయలేక పోయింది. ఎందుకంటే అమెరికాతో పాటు రష్యాతో భారత్ కు చాలా వరకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇండియాను బెదిరించలేకపోయింది. అటు చైనా ను ఏమీ చేయలేని పరిస్థితుల్లో రష్యా తన ఆదాయాన్ని పెంపొందించుకుంది. ఇలా చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతుందని అనుకున్న రష్యా కాస్త రెండు సంవత్సరాలుగా యుద్దం నడుస్తున్న ఎక్కడా కూడా ఆర్థికంగా వెనకబడకపోవడం అమెరికాకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.


రష్యా రెండు సబ్ మైరెన్లను తయారు చేస్తుంది. ఈ రెండింటి స్పెషల్ ఏంటంటే అవి న్యూక్లియర్ సబ్ మెరైన్లు. గతంలో వీటి తయారును ఆపేసిన రష్యా.. ప్రస్తుతం మొత్తం న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేసి అయిదేేళ్లలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. గతంలోో అమెరికాతో ఒప్పందం కారణంగా రష్యా న్యూక్లియర్ సబ్ మెరైన్స్ ను తయారు చేయలేదు. కానీ  అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మళ్లీ తన న్యూక్లియర్ పవర్ ను పెంపొందించుకుని ఢీ అంటే ఢీ అనేలా ముందుకు సాగాలని కోరుకుంటుంది. మరి ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగుతారో చూడాలి.


యుద్ధంలో ఎంతో మంది సైనికులను పోగొట్టుకున్న రష్యా ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ కు అండగా యూరప్ దేశాలు, అమెరికా నిలబడినా అన్ని దేశాల సహకారం తీసుకుంటున్న ఉక్రెయిన్ ను ఓంటి చేత్తో మట్టి కరిపిస్తూ ముందుకు సాగుతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలే ఆ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: