అందుకు వ్యుహాలు రచిస్తోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. తమిళనాడు, కేరళలో మిత్ర పక్ష పార్టీగా కొనసాగుతుంది. కేరళలోని వయనాడ్ సెగ్మెంట్ నుంచే గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసి ఎంపీగా గెలవడం.. తమిళనాడు లో డీఎంకె ప్రభుత్వంతో కాంగ్రెస్ కు మంచి సంబంధాలు ఉండడం కూడా కలిసొచ్చే అంశం. తమిళనాడులో పొత్తులో భాగంగా దాదాపు 10 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటుండగా అందులో 8 స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.
గత ఎన్నికల్లో కర్ణాటకలో కేవలం ఒక్క ఎంపీ స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ ఈ సారి దాదాపు 18 నంచి 20 స్థానాల్లో గెలవాలని ఆశిస్తోంది. తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో 10 ఎంపీ స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉంది. కేరళలో కూడా తమ మిత్రపక్షాల మద్దతు ఎలాగో ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తోంది.
దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా గతంలో కాంగ్రెస్ చేసిన పనులు చెప్పడమే కాకుండా ఆంధ్రప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసమే వైఎస్ షర్మిల టీడీపీ యువ నేత లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ ను పంపిందనే ప్రచారం జరుగుతోంది. ఇలా దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కచ్చితంగా 45 స్థానాల్లో గెలవాలని కోరుకుంటుంది.