ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ వైఎస్ షర్మిళ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా ఆమె ఇలాగే వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే తెలంగాణ లో వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇక్కడికే పరిమితం అవుతారని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ విజయానికి తాము ఆటంకం కాకూడదని భావించి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు షర్మిళ ప్రకటించారు.


అంతకు ముందు జగన్ కు బద్ధ శత్రువైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి తన పంథా ఏంటో చెప్పకనే చెప్పారు. ప్రస్తుతానికి అయితే నేరుగా వైటీపీ విలీనం కాకున్నా అనాధికారికంగా ఆమె హస్తం గూటికి చేరారనే చెప్పవచ్చు.  ఇప్పుడు ఏపీలో ఎన్నికలు దగ్డర పడుతున్న కొద్దీ ఆమె పేరు మరోసారి ఏపీలో నానుతుంది. ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తారన్న ప్రచారం సాగుతుంది.


అయితే షర్మిళ వెనుక ఉన్నది ఎవరు చంద్రబాబా అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్ మరణాంతరం జగన్ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ను ఎదురించడం పార్టీ పెట్టడం వంటి కారణాలతో జైలు పాలయ్యారు. ఆ సమయంలో షర్మిళ పాదయాత్ర ద్వారా పార్టీని నడిపంచగలిగారు. ఆ తర్వాత కూడా బైబై బాబు అంటూ షర్మిళ  చేసిన నినాదాలు ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. ఆ ప్రభావంతో ఆమెకి కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి పెరిగింది. ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా జగన్ కు  షర్మిళ కు మధ్య దూరం పెరిగింది.


ప్రస్తుతం ఆమె ముందున్న ఒకే ఒక్క రాజకీయ అవకాశం కాంగ్రెస్ లోకి వెళ్లడం.  ఇక్కడ షర్మిళను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి తమ ఓటు బ్యాంకును కొంతైనా తిరిగి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు షర్మిళ కనీసం ఒకటి రెండు శాతం ఓట్లను చీల్చినా తనకు లాభం జరుగుతుంది అని చంద్రబాబు భావిస్తున్నారు.  మరి షర్మిళ ఏపీలో జగన్ ఓటు బ్యాంకును చీల్చుతుందా లేదా అన్నది ఎన్నికల వరకు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: