అయినా బ్రిటన్ వాటిని పెడ చెవిన పెడుతూ.. ఉక్రెయిన్ కు తమ సాయాన్ని కొనసాగిస్తూ వస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంలో తాము మరింత జోక్యం చేసుకునే అవకాశం ఉందంటూ.. పాశ్చాత్య దేశాలు ప్రతినిధులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ లో సైనిక విన్యాసాలు ప్రారంభిస్తున్నామని.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు పుతిన్ తన సైన్యానికి ఆదేశాలు సైతం జారీ చేశారు.
వ్యూహాత్మక ఆయుధాల విన్యాసాలు సాధారణం అయినప్పటికీ.. యుద్ధం వేళ వీటి రష్యా వీటి కసరత్తుపై ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ మిత్ర దేశాలు చేస్తున్న ప్రకటనలకు ధీటుగా పుతిన్ నుంచి ఈ హెచ్చరిక వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బ్రిటన్ అందించే ఆయుధాలతో రష్యా భూ భాగాలపై ఉక్రెఇయన్ దాడులకు దిగితే.. ఆ పరిస్థితి ఉక్రియిన్ లోని లేదా.. మరెక్కడైనా బ్రిటన్ స్థావరాలు, ఆయుధాగారాలపై తాము దాడులకు దిగేలా ప్రేపిస్తుందని క్లెమ్లిన్ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే అధికారిని గూడాఛార్యం ఆరోపణలతో బ్రిటన్ బహిష్కరించింది. తమ దేశంలో రష్యా నిఘా కార్యకలాపాలపై ఈ అధికారి పర్యవేక్షిస్తున్నారని బ్రిటన్ హోం శాఖ కార్యాలయం తెలిపింది. ఈ విషయంలో రష్యా రాయబారికి కూడా సమన్లు పంపి.. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ భద్రతకే మా తొలి ప్రాధాన్యం. మిత్రదేశాలను, మా దేశ ప్రజలను రక్షించుకునేందుకు మేం చేయాల్సింది అంతా చేస్తాం అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు.