ఒకవేళ ఏపీ లో జగన్ మరోసారి గెలిస్తే ఏం జరుగుతుంది అని అంతా చర్చించుకుంటున్నారు. ఒకవేళ జూన్ 4న వెలువడిన ఫలితాలు జగన్ కు అనుకూలంగా వస్తే మాత్రం టీడీపీ మూలాలను సమూలంగా నాశనం చేస్తారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే టీడీపీలో ఉంటే ఆపార్టీ నాయకులు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులను సృష్టిస్తారు. ఇప్పటికే టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీసిన జగన్.. ఇక పార్టీ మూలాలను లేకుండా చేసేందుకు కంకణం కట్టుకుంటారు. మొత్తంగా టీడీపీ కకావికలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆపార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇక ప్రభుత్వ పరంగా చూసుకుంటే సంక్షేమానికి ప్రాధాన్యం తగ్గకుండా చూస్తూ వాటిని కొనసాగిస్తూ వస్తారు. ఇక అభివృద్ధి విషయానికొస్తే తాను చెబుతున్న పోర్టులు, షిప్టులు, ఫిషింగ్ హార్బర్లు వంటి వాటిని డెవలప్ చేస్తూ తన విజన్ ని అమలు చేస్తారు. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ రావడానికి కారణమైన పరిశ్రమలపై దృష్టి సారిస్తారు.
ఇప్పటి వరకు జగన్ ఏపీకి చాలా చేసినా ప్రచారం మాత్రం చేసుకోలేకపోయారు. కేవలం సంక్షేమాన్ని ఎజెండాగా తీసుకొని ఎన్నికలకు వెళ్లారు. అది అయితేనే తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది అనే ఉద్దేశంతో. ఈ సారి మాత్రం పరిశ్రమలు, ఇతర మౌలిక వసతుల గురించి వివరించే అవకాశం ఉంటుంది. ప్రాధాన్య అంశాలు మారిపోతుంటాయి. జనసేనకు చెక్ పెడుతూ.. కూటమిని అయితే పక్కాగా దెబ్బతీస్తారు. ఈ ఎన్నికల్లో కనుక విజయం సాధిస్తే రాజకీయ స్థిరత్వం సాధించి భవిష్యత్తులో మమతా బెనర్జీ మాదిరిగా ఏపీలో పాతుకొని పోతారు. చూద్దా ఏం జరుగుతుందో.