మతం, కులం, సాంస్కృతిక అంశాలపై జన సమూహాలను రెచ్చగొట్టి నమ్మించవచ్చు. ఈ అంశాలు సున్నితమైనందున సులువుగా జనాలను తమవైపు తిప్పుకుంటారు. అదే తార్కిక ధోరణి, వాదనల ద్వారా జనాన్ని వీలైనంత త్వరగా నాయకులు తమ వైపు ప్రజలను తిప్పుకోలేరు. అయితే ఇప్పటి వరకు బీజేపీ హిందుత్వ ఎజెండాతోనే ఎదిగింది. అపూర్వ విజయం సాధించింది.


ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి కొంత మిశ్రమ ఫలితాలు వచ్చినా… అధికారాన్ని అయితే నిలబెట్టుకోగలిగింది. ఈ సందర్భంగా లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మాన సందర్భంగా రాహుల్ గాంధీ హింసాత్మక హిందూ అనడంపై బీజేపీ రాద్ధాంతం చేసింది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అనే చెప్పేందుకు బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తోంది.


అయితే ఇప్పుడు కాంగ్రెస్ స్టైల్ మార్చింది.  ముల్లును ముల్లుతోనే తీయాలి అనేలా.. హిందుత్వ సిద్ధాంతాలతో బీజేపీని దెబ్బకొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. గతం మాదిరిగా సైద్ధాంతిక అంశాల ప్రాతిపాదికన వెళ్తే ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని హస్తం సీనియర్లకు అర్థం అయింది. 2019 ఎన్నికల్లో రాఫెల్ డీల్, నోట్ల రద్దు, ఆర్టికల్ 370, జీఎస్టీ వంటి అంశాలతో ఎన్నికలకు వెళ్లినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో తమ ఎజెండాను మార్చింది.


ప్రస్తుతం జనాలకు చాలా సింపుల్ గా వెళ్లే విషయాలు అంటే.. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎగబడితే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని.. దేశం నాశనం అయిపోతుందని.. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేలా విమర్శిస్తోంది. హిందూ స్వామీజీలను బీజేపీ ఏకం చేస్తుంది. మరోవైపు ఇలాంటి వారి చేత కాషాయ దళాన్నే తిట్టించడం లాంటివి చేస్తోంది. అందులో భాగంగానే జ్యోతిర్ మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానందతో బీజేపీ పై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు తప్పేం కాదని సమర్థించారు. ఇక రానున్న రోజుల్లో స్వామీజీల చేత బీజేపీని తిట్టించి వారిని హిందువులకు దూరం  చేసే విధంగా కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: