జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనే ఉద్దేశంతో ప్రస్తుత యువత విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా సమాజంలో స్టేటస్,  వారు బాగుండాలని ఇతర దేశాలకు పంపించేందుకు వెనకాడటం లేదు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అమెరికా ఇప్పుడు వెళ్లే వారికి అయితే మన ఊరు, బంధువులు, స్నేహితులు అంతా గుర్తు ఉంటారు.


ఏడాదికో, రెండేళ్లకో ఓ సారి వచ్చినా మార్పులు చూసి ఆశ్చర్యపోయినా.. మనుషులను, గ్రామాలను గుర్తు పడతారు. పేరు పెట్టి పలకరిస్తుంటారు. 15, 20 ఏళ్ల క్రితం వెళ్లిన వారికి కూడా దాదాపు అంతో ఇంతో మనం కాకపోయినా మన తల్లిదండ్రులు తెలిసే ఉంటారు.  ఇదే క్రమంలో మన వాళ్లు అక్కడికి వెళ్లినా సహాయ సహకారాలు అందిస్తుంటారు.  కానీ తరం క్రితం వెళ్లిపోయినా వారికి మనం గుర్తు ఉన్నామా.. విదేశాలకు వెళ్లిన తర్వాత మనల్ని పట్టించుకుంటారా అంటే లేదనే సమాధానం చాలా మంది ఎన్నారైల దగ్గర నుంచి వినిపిస్తోంది.


అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ వాన్స్ ను ప్రకటించారు. ఆయన భార్య ఉషా చిలుకూరి ఏపీ సంతతికి చెందిన మహిళే అని గర్వంగా చెప్పుకొంటున్నాం. ఆమె చరిత్రను వెతికి మరీ బయటకు తీస్తున్నారు. ఉషా చిలుకూరి కృష్ణా జిల్లా ఆడపడుచు అని.. ఆమె మూలాలు ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాయని చెబుతున్నారు.  ఆమె తాత వరుస అయ్యే చిలుకూరి రామ్మెహన్ రావు కుటుంబం ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటోంది.  ఆయన దగ్గర నుంచి వంశ పూర్వీకుల ఫొటో లభ్యం అయింది.


ఉషా పూర్వీకులు కృష్ణా జిల్లా నుంచి దశాబ్ధాల క్రితం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.  సాయిపురంలో 18 శతాబ్ధంలో చిలుకూరి బుచ్చి పాపయ్య నివసించారు. ఆయన వారసత్వమే శాఖోపశాకలుగా విస్తరించింది. ఉషా తాతా ఫ్యామిలీ రామశాస్త్రి ఎప్పుడో మద్రాస్ తరలి వెళ్లారు. వీరి కుమారుడు రాధాకృష్ణ, పామర్రుకు చెందని లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరి సంతానమే ఉష. మనం ఆమెను ఓన్ చేసుకోవడం బాగానే ఉన్నా ఇంతకీ ఉషకు అసలు కృష్ణా జిల్లా గురించి తెలుసా.  ఎందుకు అంటే ఆమె మద్రాస్ లో పెరిగింది కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: