బ్రిటన్ ప్రధానిగా కష్ట కాలంలోపదవీ బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్ 20 నెలల పాటు సాగిన పాలన సవాళ్ల మధ్యే సాగింది. సునాక్ కు ముందు ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ తీరుతో కన్జర్వేటివ్ పార్టీ దెబ్బతింది. కోరోనా లాక్ డౌన్ సమయంలో జాన్సన్ తో పాటు ఆయన బృందం పార్టీలు చేసుకోవడం తీవ్ర వివాదస్పదమైంది. బోరిస్ తర్వాత లిజ్ ట్రస్ 49 రోజులు తీరుతోను ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది.


భారీగా పన్నులు తగ్గించడం మూలంగా జీవన వ్యయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. వీటితో పాటు ప్రజారోగ్య వ్యవస్థ, మౌలిక వసతుల కల్పించడంలో వైఫల్యం వంటి పరిస్థితుల ఆ పార్టీపై విశ్వాసాన్ని మరింత దిగజార్చాయి. ఇటువంటి సమయంలో ప్రధానిగా రిషి సునాక్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ.. అనుకూల పరిస్థితుల్లో ఈ పదవి చేపట్టలేదని పలు సందర్భాల్లో చెప్పారు.


ద్రవ్యోల్బణాన్ని దారికి తీసుకువచ్చారు. అంతకు ముందు 12 శాతం వరకు ఉన్న దానిని 2 శాతానికి తీసుకువస్తానని చెప్పి చేసి చూపించారు.  కాకపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే ఆయన చేసిన పొరపాటుగా పలువురు అభిప్రాయపడ్డారు.


ఓ రకంగా చెప్పాలంటే లేబర్ పార్టీ భారీ విజయాన్ని ఏమీ పొందలేదు. కేవలం 36 శాతం ఓట్లు మాత్రమే పొందింది. అదే సమయంలో రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ కూడా చాలా వరకు ఓట్లు సాధించగలిగింది. ఇవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ. పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో పాటు అక్కడక్కడా బ్రిటన్ లో దాడులు చోటు చేసుకుంటున్నాయి.


నార్తంట్ ఇంగ్లాండ్ టౌన్ లో పెద్ద ఎత్తున విధ్వంసాలు జరుగుతున్నాయి.  బ్రెస్సెల్స్ కి స్వతంత్రం ఇచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. మరో వైపు వెయ్యి మంది ఖైదీలను విడిచిపెట్టగా వీరి మూలంగా శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. బ్రిటన్ లోకి చొరబడిన 90 వేల మంది శరణార్థులకు చట్ట భద్రత కల్పించేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఆ దేశ ప్రజలు ఈ మార్పులను ఎలా స్వీకరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: