రష్యాలో మంచి జీతం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పిన మాటలను నమ్మిన చాలా మంది భారతీయులు అక్కడకి  వెళ్లారు. రష్యా సైనిక స్థావరాల్లో సహాయకుల్లో పనిచేసే ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెబితే.. పేద కుటుంబాలకు చెందిన సుమారు 500 మంది భారతీయులు వెళ్లారు. ఆ ఏజెంట్లకు లక్షల రూపాయలు డబ్బులు చెల్లించారు.  


కానీ తర్వాత సైన్యంలో చేర్చారని కుటుంబాలకు తర్వాత తెలిసింది. భారత్ నుంచి రష్యాకు వెళ్లిన వారందరి వయసు 22 నుంచి 31 ఏళ్ల మధ్యే ఉంటుంది. బాధితుల్లో తెలంగాణ, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, కశ్మీర్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వారు కూడా ఉన్నారు.  అయితే గుజరాత్ కు చెందిన హేమిల్, హైదరాబాద్ కు చెందిన మహ్మద్ లు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చనిపోయిన తర్వాత మిగిలిన భారతీయులను వెనక్కి రావాలని వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నాయి.


ఇటీవల ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లారు. ఈసందర్భంగా మాస్కోలో సమావేశం అయిన పుతిన్, మోదీలు ఈ సమస్యపై చర్చించారు.  ఇలా మోసపోయి రష్యా వెళ్లిన తమ దేశస్థులను పంపించాలని ప్రధాని కోరినట్లు తెలుస్తోంది.  దీంతో బాధిత కుటుంబాల్లో ఆశలు చిగురించాయి.  అయితే తమ ఆర్మీలో పనిచేసే చాలా మంది భారతీయులకు చట్టపరమైన వీసాలు లేవని దిల్లీలోని రష్యా రాయభార కార్యాలయం తెలిపింది.


రష్యా ఉద్దేశపూర్వకంగా సైన్యంలో భారతీయులను చేర్చుకోలేదు. ఈ యుద్ధంలో వారెలంటి పాత్ర పోషించరు. భారత ప్రభుత్వానికి రష్యా అండగా నిలుస్తుంది. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తున్నాం అని రష్యా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు మోదీ మాటను పుతిన్ గౌరవించి అక్కడ త్రివిధ దళాలతో రష్యా అధ్యక్షుడు మాట్లాడారు. భారత్ నుంచి వచ్చిన వారిలో ఎంత మంది మన సైన్యంలో ఉన్నారు.  యుద్ధంలో కొనసాగుతారా.. లేక వెళ్లిపోతారా అనేది వాళ్లతో ఒక స్టేట్ మెంట్ తీసుకోండి.. వెళ్తామంటే వెనక్కి పంపించేయండి అని పుతిన్ అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: