పాక్ సైన్యం తీవ్రవాదులకు మద్ధతుగా ఉంటోందనే ఆరోపణలు గత కొన్నేళ్లుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.  ఇందులో పాకిస్థాన్ సైన్యం కూడా ఉగ్రవాదులకు బోర్డర్ లో ఫార్వర్డ్ పోస్టులకు మార్గ నిర్దేశం చేయడంచ భారత దేశంలోకి చొరబడటానికి మార్గాలను చూపుతున్నట్లు కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి.


ఈ మేరకు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని కోట్లి సమీప ప్రాంతాల నుంచి ఈ విజువల్స్ తెరపైకి వచ్చాయి. భారత సరిహద్దుల్లో చొరబడేందుకు ఉగ్రవాదులకు సైన్యం శిక్షణ ఇస్తున్నట్లు పీవోకే నుంచి చిత్రాలు వెలువడిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. కాగా ఈ మధ్య కాలంలో జమ్మూ అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోయింది. సామాన్య ప్రజలతో పాటు సైన్యం కూడా తీవ్రవాదుల వలలో చిక్కుకుంది. పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడ్డారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.


భారత సైన్యంలోని ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబడేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నుతోంది. పాకిస్థాన్ రేంజర్ల ముసుగులో పంజాబ్ లేదా.. జమ్మూ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని సియాల్ కోట్ మీదుగా ఉగ్రవాదులు చొరబడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఉగ్రవాదుల సంఖ్య దాదాపు 50-55 వరకు ఉంటుందని అంచనా సాంబా నుంచి హీరా నగర్ మీదుగా కథువాకు తీవ్ర వాదులు చేరుకుంటున్నారని తేలింది.


అయితే ఉగ్రదాడులు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో కేంద్రీకరించే సమయంలో బలగాలు పలచబడతున్నాయి. అయితే ఆఫ్గాన్ లో అమెరికా వదిలేసిన ఆయుధాలు, అత్యంత అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు, రాత్రి పూట చూడగలిగే పరికారాలు ఉపయోగించడంలో ఉగ్రవాదులు దిట్టలు. పాకిస్థాన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వారు కూడా కొందరు ఈ ఉగ్రవాదుల్లో చేరి ఉంటారని అనుమానిస్తున్నారు. 2021 నుంచి మొదలుకొని ఇటీవల దోడా జిల్లాలో జరిగిన దాడి వరకు దాదాపు 48 మంది సైనికులు చనిపోయారు.  ఇందులో ఒక కెప్టెన్ కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: