అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చేది ఆర్థిక సాయమా, లేక కేవలం అప్పు మాత్రమేనా అనేది ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజధానికి రూ.15 వేల కోట్ల కేటాయింపులు అంటూ ముందు హడావుడి జరిగింది. ఈ తర్వాత అది ప్రపంచ బ్యాంకు రుణం, కేంద్రం కేవలం దానికి హామీగా ఉంటుందనే విషయం తెలిసే సరికి ప్రతిపక్షం విమర్శల జోరు పెంచింది.


పదేళ్లుగా రాజధాని లేదు. ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి ప్రాణ వాయువును ఏపీలోని 16 మంది టీడీపీ, ఇద్దరు జనసేన ఎంపీలు అందిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన ఏపీకి కేంద్రం రుణం ఎలా తీర్చుకుంది అంటే రుణంతోనే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  


ఏపీలో అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో ఉందని అంటూనే దాని ప్రకారం వరల్డ్ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు తెప్పిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏపీ తన వాటా భరిస్తుందా లేదా అనేది చూడాలని కేంద్ర మంత్రి చెప్పారు. ఇక ఏది ఎలా ఉన్నా కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.  అంటే ప్రపంచ బ్యాంకు రుణానికి కేంద్రం పూచీకత్తు తీసుకునే బాధ్యతను కేంద్ర మంత్రి చెప్పారని అంటున్నారు.  


ప్రపంచ బ్యాంకు ఉచితంగా ఎవరికీ రుణాలు ఇవ్వదు. ఈ నేపథ్యంలో కేంద్రం మధ్యవర్తిగా ఉంటుందని అంటున్నారు. పైగా దీనిని 30 ఏళ్ల తర్వాత చెల్లించాలి. ఆ తర్వాత దీనిని ఏపీకి ఇచ్చే గ్రాంటుగా మార్చేస్తారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే ఆర్థిక సాయం అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, ఉత్తరా ఖండ్ తో పాటు జార్ఖండ్ లు మాకు సాయం కావాలని అడుగుతాయి. అందుకే ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా ఏపీకి ఈ మొత్తాన్ని  అందించారని అంటున్నారు. దీంతో పాటు ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్డులు, రైల్వే కట్టడాలతో పాటు ప్రకాశం జిల్లాకు రూ.50 కోట్ల ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వడానికి కేంద్రం సుముఖుత వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: