దీంతో పాటు మిగతా ఏయే దేశాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో గుర్తించి వాటితో ఒప్పందం కుదుర్చుకొని వాటిపై ఆధిపత్యం సాధించింది. ఈ కారణం చేతనే ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా.. రష్యా తట్టుకొని నిలబడింది. ఇంకా పెద్ద దేశంగానే చెలామణీ అవుతుంది. ఇదే సమయంలో భారత్ కూడా అగ్రదేశంగా నిలవాలంటే.. మనకి కూడా అలాంటి ఆదాయ వనరులు కావాలి. భారత దేశం సహజ వనరులకు కేంద్రం. కాకపోతే ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. గత ప్రభుత్వాలు వీటిపై పెద్దగా దృష్టి సారించలేదు. కానీ ప్రధాని మోదీ ఏయే సహజ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని కొన్ని సంస్థలకు అప్పజెప్పారు.
అప్పుడే నల్లమలలో ఖనిజ నిక్షేపాలు, అండమాన్ దీవుల్లో పెట్రోలియం నిక్షేపాలు, కొన్ని చోట్ల బాక్సైస్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు తాజాగా లిథియం నిల్వలు భారత్ లో అపారంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లో లిథియానిదే హవా కొనసాగుతుది. బ్యాటరీల తయారీలో ఉపయోగించే లిథియాన్ని ప్రస్తుతం మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
గతంలో వీటిని కశ్మీర్, ఏపీలో గుర్తించారు. తాజాగా కర్ణాటక రాష్ట్రం మాండ్యలో దాదాపు 1600 టన్నుల లిథియం వనరులను గుర్తించినట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ తో సహా బహుళ పోర్ట్ ఫోలియోలను పర్యవేక్షిస్తున్న కేంద్రం మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఏఎండీ ప్రాథమిక సర్వేలు, పరిమిత ఉపరితల అన్వేషణల ద్వారా మాండ్య జిల్లాలోని మర్లగల్ల ప్రాంతంలో ఈ లిథియం నిల్వలను గుర్తించింది. ఇది భవిష్యత్తులో భారత్ కు అతి పెద్ద ఆదాయ వనరు కానుంది.