పాక్ జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యూయేట్ అయినా ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో పాకిస్థాన్ లోని ఆడియాలా జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్  పదవి కోసం ఆన్ లైన్ బ్యాలెట్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.


ఇమ్రాన్ కాన్ 1972లో ఆక్స్ ఫర్డ్ లోని కేటుబ్ కాలేజీలో ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ చదివారు. అలాగే 2005 నుంచి 2014 వరకు బ్రాడ్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ఇమ్రాన్ ఛాన్సలర్ గా కూడా పనిచేశారు. ఇమ్రాన్ తో పాటు బ్రిటన్ మాజీ ప్రధానులు టోనో బ్లెయిర్, బోరిస్ జాన్సన్ లు కూడా ఛాన్సలర్ పదవికి పోటీలో ఉన్నట్లు సమాచారం.


గ్రాడ్యుయేట్లు పూర్తి అకాడమిక్ దుస్తులతో హాజరు కావాలనే సంప్రదాయ ప్రక్రియకు బదులుగా ఆన్ లైన్లో ఛాన్సలర్ ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటటీ  ఛాన్సలర్ గా 21 ఏళ్ల పాటు సర్వీసులో ఉన్న లార్డ్  ప్యాటెన్ రాజీనామాతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ఈ పదవికి ఇమ్రాన్ పోటీ చేయనున్నట్లు ఆయన అంతర్జాతీయ వ్యవహారాల సలహాదారు జుల్ఫీ బుఖారీ ఓ మీడియా సంస్థకు తెలిపారు.


ఇమ్రాన్ నుంచి స్పష్టత వచ్చాక బహిరంగంగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ రేసులో ఆయన గెలుస్తారని బుఖారీ ధీమా వ్యక్తం చేశారు. అలాగే అతనికి పలువురి నుంచి మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులు బాటు ఉందని ఇమ్రాన్ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే ప్రస్తుతం పాక్ జైల్లొ అనేక అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఒక్కో కేసులో బయట పడుతున్నా.. అంతకు మించి కేసులను అక్కడి ప్రభుత్వం పెడుతోంది. ప్రస్తుతం అతనికి అంతర్జాతీయ మద్దతు అవసరం ఉంది. అందుకే ఈ పదవికి పోటీ చేస్తున్నారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: