అవును.. సిగ్గు సిగ్గు మాజీ సీఎం జగన్ ప్రతి పక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ అడుగు పెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకు ముందు పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనిపించవు, వినిపించవు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు స్పందించగా.. ఆమె మరింత ఘాటుగా రిప్లై ఇచ్చారు.
జగన్ ని అసెంబ్లీకి వచ్చి చంద్రబాబుని నిలదీయమని చెబితే అది తాను చంద్రబాబుకి కొమ్ము కాసినట్లు ఉందా అని ప్రశ్నించారు. ఇది మీ ముర్ఖత్వానికి నిదర్శనం. మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలని వైసీపీ నేతలనుద్దేశించి అన్నారు. మిమ్మల్ని అద్దంలో చూసుకోమంది అందుకే అంటూ ఫైర్ అయ్యారు.
అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే.. ఇప్పుడు వైఎస్సార్ విగ్రహాలకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. అసలు వైసీపీలో వైఎస్సార్, విజయమ్మలను అవమానింలేదా అని ప్రశ్నించారు. వైసీపీ నుంచి వైఎస్సార్ ను ఎప్పుడో వెళ్లగొట్టారని దుయ్యబట్టారు. వైసీపీకి అసెంబ్లీలో పోరాటం చేతకాదని.. వీరికి మీడియా పాయింటే ఎక్కువని ఎద్దేవా చేశారు.
నాడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్చకుండా ఉంటే నేడు వైఎస్ కు అవమానం జరిగి ఉండేది కాదన్నారు. దీంతో పాటు వైసీపీకి మరోసారి అర్థాన్ని వివరించారు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే అని అన్నారు. అంతే కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టు పెట్టారు అంటూ.. మీ అహంకారమే మీ పతనానికి కారణం అని ఘాటుగా విమర్శించారు.