వైనాట్ 175 అని ఎన్నికలకు వెళ్లిన జగన్.. పాలనను ప్రజలు ఆహ్వానించలేదు. వాస్తవానికి జగన్ మరీ అంత దారుణంగా పరిపాలించారా.. ఈ ఐదేళ్లలో అభివృద్ధే చేయలేదా అంటే.. చాలా మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. అయినా ప్రజల తిరస్కారానికి గురి కాక తప్పలేదు. దీనతంటికి కారణం తాను చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్పకపోవడమే. ఎంత వరకు డబ్బులు పంచాను. బటన్ నొక్కాను అనడమే తప్ప అభివృద్ధి ప్రస్తావన ఎక్కడ కూడా తీసుకురాలేదు.
ఇదే సమయంలో ఎల్లో మీడియా వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని చేసింది. కానీ దానిని వైసీపీ అనుకూల మీడియా తిప్పి కొట్టేలేకపోయింది. ఇక ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఎన్నికల ముందు.. ఆ సమయంలో ప్రచురించాల్సిన కథనాలను ఇప్పుడు రాసుకొస్తుంది సాక్షి. అందలుఓ భాగంగా జగన్ హయాంలో పరిమితంగానే అప్పులు ఉన్నాయని.. గుజరాత్, తెలంగాణ, కర్ణాటక కన్నా తక్కువే. జాతీయ తలసరి ఆదాయం కన్నా.. కూడా ఏపీ ఆదాయమే ఎక్కువ. 2024-25 కేంద్ర బడ్జెట్ పై ఎస్బీఐ నివేదికను ఇప్పుడు హైలెట్ చేసింది.
దీంతో పాటు జగన్ హయాంలో మూడేళ్లలో 2,28,000 మంది మహిళలు ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ మేరకు రాజ్యసభలో ఆ శాఖ మంత్రి జితేంద్ర మాంఝీ లెక్కలు వివరించారు. 2021-22లో 34680 మంది, 2022-23లో 70811, 2023-24లో 122863 యూనిట్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే అంశంతో ఎంఎస్ఎంఈలను ప్రవేశపెట్టారు. గడిచిన మూడేళ్లలో 19,30,188 యూనిట్లకు రూ.94,296 కోట్ల రుణాలను అందించారు. 2019లో జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయానికి రాష్ట్రంలో మొత్తం అప్పటికీ 1.96 లక్షల ఎంఎస్ఈలు ఉంటే.. ప్రస్తుతం వాటి సంఖ్య 8.89 లక్షల యూనిట్లకు చేరింది. కేవలం ఎంఎస్ఎంఈల ద్వారా 28 లక్షల మందికి ఉపాధి లభించిందని రాజ్యసభలో కేంద్ర మంత్రి వెల్లడించారు.