ఏపీలో ప్రజానీకం ఎన్నో ఆశలు పెట్టుకొని రెట్టింపు సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలకు ఆశపడి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలను గెలిపించారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇచ్చిన హామీలకు ప్రజలు ఆకర్షితులయ్యారు అనేది వాస్తవం. కూటమికి దక్కిక గెలుపులో జగన్ పై వ్యతిరేకత కంటే.. ఉచిత హామీలే కీలక భూమికి పోషించాయి.


అయితే కూటమి అధికారంలోకి వచ్చిన సూపర్ సిక్స్ హామీల ప్రస్తావన లేకుండా పరిపాలన సాగిస్తున్నారు. తల్లులు ఆశగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం ఈ ఏడాది లేదని మంత్రి నారా లోకేశ్ కుండ బద్దలు కొట్టారు. ఇక అసెంబ్లీలో సూపర్ సిక్స్ హామీల గురించి ఆలోచన చేయాలంటే… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళన కరంగా ఉందని చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీల అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసే ఆరోగ్య శ్రీ పథకంపై కూడా బాంబు పేల్చారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డును అర్హులందరూ తీసుకునేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూర్ లోక్ సభ పరిధిలో సుమారు మూడు లక్షల కుటుంబాలకు అర్హత ఉండగా కేవలం.. 28వేల కార్డులే ఇప్పటి వరకు ఇచ్చారని అన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను ఈ కార్డులు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదిలా ఉండగా.. ఈ కార్డు ద్వారా రూ.5లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యాన్ని పొందవచ్చు. అదే ఆరోగ్య శ్రీ అయితే రూ.25 లక్షల వరకు కవరేజ్ అందుతోంది. చంద్రబాబు, పవన్ లు పేదలకు మేలు చేసే వైద్యంలో కూడా కోతలు పెడుతున్నారని వైసీపీ నాయకులు మండి పడుతున్నారు. దీనిపై ఇప్పటికే షర్మిళ కూడా చంద్రబాబుకి సూటి ప్రశ్నలు వేశారు. మరి ఇప్పటికీ అయినా ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవరసం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: