గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడం యాభై రోజులు గడిచిపోవడం చకచకా జరిగిపోయాయి. అయిగే ఈ యాభై రోజుల పాలనలో గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిండానికే ఎక్కువ సమయం కేటాయించినట్లు అర్థం అవుతుంది. ప్రస్తుతానికి అయితే సూపర్ సిక్స్ హామీల అమలు ఊసే లేదు. ఆ సంగతి ఇలా ఉంచితే.. ఏపీలో ప్రస్తుతం డబ్బులు లేవు. చాలా ఇబ్బందులు ఉన్నాయని.. ఈ విషయం ఇప్పుడే తనకి తెలిసింది అంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు చంద్రబాబు.


వాస్తవానికి ఏపీలో రోడ్ల పరిస్థితి ఏమంత బాగాలేదు. ఈ విషయమై గత సర్కారుపై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కనీసం కి.మీ. రోడ్డు కూడా వేయలేదని విమర్శించింది. అయితే జగన్ సర్కారు మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రోడ్లకు మరమ్మతులు చేయించారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


ఏపీలో సంపద వనాల సృష్టిలో భాగంగా చంద్రబాబు ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు టోల్ గేట్ రోడ్లు అంటూ.. గ్రామ, మండల స్థాయిలో టోల్ రోడ్లను ఏర్పాటు చేయనున్నారు. గుంతలు పడిన రోడ్ల కోసం పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్ధతిలో రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇక గ్రామ, మండల స్థాయిలో కూడా టోల్ గేట్లు దర్శనమిస్తాయి.


మొత్తం 27 రోడ్లను ఎంపిక చేసినట్టు సమాచారం. గారా-అలికాం-చింతాడా-బత్తిలి, కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతీపురం, చిలకపాలెం-రాజాం-రాజమహేంద్రవరం, భీమిలిపట్నం-నర్సీపట్నం-తుని-సంభవరం, విశాఖపట్నం-కొత్తవలస-ఎస్.కోట-అరకు, రాజమండ్రి-మారేడుమిల్లి-భద్రాచలం, అమలాపురం-బొబ్బరలంక, ఏలూరు-కైకలూరు, ఏలూరు-చింతలపూడి-మేడిశెట్టివారిపాలెం, కైకలూరు-గుడివాడ, గుడివాడ-కంకిపాడు విజయవాడ రోడ్డు, విజయవాడ-ఆగిరిపల్లి-నూజివీడు రోడ్డు, గుంటూరు-పరుచూరు రోడ్డు, నరసారావు పేట-సత్తెనపల్లి రోడ్డు, ఓడరేవు-చిలకలూరిపేట-నరసరావుపేట- పిడుగురాళ్లు, కావలి-ఉదయగిరి-కలిగిరి-సీతరాంపురం,  నెల్లూరు-పొదలకూరు-సైదాపురం, గూడూరు-సైదాపురం-రాపూరు-రాజంపేట, మైదుకూరు-తాడిచర్ల, పులివెందుల-బత్తలపల్లి –ధర్మవరం-ధర్మాజీపేట, చాగళ్లమర్రి-ప్రొద్దుటూరు-ఎర్రగుంట్ల-రాయ్చూట్ రోడ్లు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఇలా మొత్తం 1,777 కి.మీ. సంబంధించిన రోడ్లను కొత్తగా వేసి.. ఆతర్వాత ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: