ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా పరాజయం పాలైంది. వైనాట్ 175 అంటూ మొదలు పెట్టిన ఎన్నికల ప్రచారం తీరా ఫలితాల దగ్గరకి వచ్చి చూస్తే 11 దగ్గరికి వచ్చి ఆగిపోయింది. వైసీపీ అధినేత జగన్, మంత్రి పదవులు నిర్వహించిన వారిలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిని వారంతా ఓటమి పాలయ్యారు.


జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు పూర్తిగా తాడేపల్లి క్యాంపు ఆఫీస్, నివాసానికే పరిమితం అయ్యారు. ప్రజలకు దూరం అయ్యారని అందుకే ఓటమి పాలు కావాల్సి వచ్చిందనే విశ్లేషణలు సాగాయి. 2019 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా, రైతుల కోసం ధర్నాలు, పాదయాత్ర ఇలా అనేక రూపాల్లో జగన్ ప్రజల్లో ఉన్నారు.


అయితే 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు పూర్తిగా దూరం అయ్యారని.. సలహాదారులు, సమన్వయకర్తలపైనే ఆధారపడ్డారని విమర్శలు వ్యక్తం అయ్యాయి. పార్టీ నేతలు ప్రజలకు దూరం కావడం వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా తెలుస్తోంది.


ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన ప్రజా మద్దతు మాత్రం పెద్దగా కోల్పోలేదని ఎన్నికల ఓట్ల శాతం చూస్తేనే అర్థం అవుతుంది.  ఆ పార్టీకి సింగిల్ గా 40  శాతం ఓట్లు వచ్చాయి. ఓటమి శాతం 10 మాత్రమే. ఎన్డీయే సూపర్ సిక్స్ హామీలకు ప్రజలకు ఆకర్షితులయ్యారు.  దీంతో వారు కూటమికి పట్టం కట్టారు.


అయితే చంద్రబాబు పాలన చేపట్టి రెండు నెలలు కావొస్తున్నా సూపర్ సిక్స్ ను ఇంకా బోణీ చేయలేదు. అసలు పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే బడ్జెట్ పెట్టి ఇందులో నిధులు కేటాయించలేదు. ఈ సమయంలో ప్రజలంతా మళ్లీ జగన్ నే నమ్ముతారా అని వైసీపీ నాయకులు చెబుతున్నారు.  మరి నిజంగా జనం జగన్ వైపు ఉన్నారా లేదా అలా తనవైపు తిప్పుకోవాలి అంటే.. ప్రభుత్వ  వ్యతిరేకతను మాత్రమే నమ్ముకోకుండా తన బ్రాండ్ ఇమేజ్ ని మళ్లీ పెంచుకోవాలి. జగన్ కు ఎల్లో మీడియా మాదిరి బలమైన నెట్ వర్క్ లేదు. దీని కోసం జగన్ ఎవరిపై ఆధారపడకుండా  ఇప్పటి నుంచే ప్రత్యేక వ్యూహాలు రచించుకోవాలి. అప్పుడే 2029లో అధికారం సాధ్యం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: