ఆరోగ్య శాఖకు పెనాల్టీ పడింది. 16 బోధనాసుపత్రుల్లో సరిపడా సిబ్బంది లేరని గుర్తించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాటికి జరిమానా విధించింది. ఒక్కో బోధానాసుపత్రికి రూ.3 నుంచి రూ.5లక్షల చొప్పున పెనాల్టీలు విధించింది. వాటిని ఆరోగ్యశాఖ కూడా చెల్లించేసింది. ఆరోగ్య శాఖ రూపు రేఖలు మార్చేశామని, దేశంలో ఎవ్వరూ కూడా ఈ స్థాయిలో ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయలదేని గొప్పలు చెప్పిన మాజీ సీఎం జగన్ హయాంలో ఏర్పాటైన ఐదు కాలేజీలు జరిమానా పడిన జాబితాలో ఉండటం గమనార్హం.


నాడు నేడు అంటూ ఆరోగ్యశాఖలో నాటి వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. కానీ ఈ శాఖ పరధిలోని మెడికల్ కాలేజీలకు, కొత్తాగా తామే కట్టిన కళాశాలలకు సరిపడి ఫ్యాకల్టీని మాత్రం ఇవ్వలేదు. అరకొర సిబ్బందితో ఈ ఐదేళ్లూ కాలేజీలను నడిపించారు. ఇటీవల తనిఖీలకు వచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారుల తనిఖీల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.


ఆరోగ్యశాఖ చరిత్రలోనే తొలిసారి ఎన్ఎమ్సీకి పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. ఈ పెనాల్టీల తీరు చూస్తే గత ప్రభుత్వం ఆరోగ్య శాఖపై, బోధానాసుపత్రులపై ఏ విధంగా దృష్టి సారించిందో అర్థం అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే నెలాఖరు వరకూ ఎన్ఎంసీ రాష్ట్రంలోని 16 మెడికల్ కాలేజీ్లో అకస్మాత్తుగా ఆన్ లైన్ తనిఖీలు చేపట్టింది. అనేక అంశాల ఆధారంగా ఈ తనిఖీలు జరిగాయి.


అయితే ఇందులో ప్రధానంగా ఫ్యాకల్టీలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21 మెడికల్ కలాశాలలు ఉండగా.. అందులో 16 కాలేజీల్లో తీవ్రమైన ఫ్యాకల్టీ కొరత ఉందని ఎన్ఎంసీ గుర్తించింది. దీనిని సరిచేసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సూచనలు చేయడంతో పాటు ప్రస్తుతానికి పెనాల్టీతో సరిపెట్టింది. మరోసారి చేపట్టే తనిఖీల్లో ఫ్యాకల్టీ సమస్య తలెత్తకూడదని ఒకవేళ అలా జరిగితే.. ఎంపీబీఎస్ సీట్లు తగ్గించడం లేదా ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చిరించింది. ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ కాలేజీల డెవలప్ మెంట్ సొసైటీ ఖాతాల నుంచి పెనాల్టీలను చెల్లించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: