బంగ్లాదేశ్ లో ముస్లిం జనాభాయే ఎక్కువ. అధికారికంగా హిందువులను మైనార్టీలుగా ప్రకటించకపోయినా.. ఇప్పటికే అక్కడి వాళ్లు మైనార్టీలుగా ఉండిపోయారు. ఇప్పుడు రాజకీయ సంక్షోభం ముదరడం వల్ల ఈ వివక్ష చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హిందూ ఆలయాలను, ఇళ్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు. హిందువులపై దాడులు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. భారత్ చుట్టూ ఉన్న సరిహద్దు దేశాలన్నీ మన నాశనాన్ని కోరేవే. ప్రస్తుతం పాకిస్థాన్ లో సైనిక పాలనే. బంగ్లాదేశ్ ఇప్పుడే సైన్యం చేతిలోకి వెళ్లింది. శ్రీలంకలో పరోక్ష సైనిక పాలన సాగుతోంది. ఇక మయన్మార్ లో పక్కా సైనికులదే పెత్తనం. ఈ నాలుగు దేశాల ప్రజలకు అక్కడ తిండి దొరకడం లేదు. ఉపాధి అవకాశాలు లేవు. ఉద్యోగాల ఊసే లేదు. బతకడమే కష్టతరంగా మారింది.
ఇప్పుడు వీరంతా అక్రమ మార్గంలో భారత్ లోకి రావడం.. బతుకుదెరువు సాగించడం వంటివి ప్రస్తుతం జరిగిపోతున్నాయి. పైగా బంగ్లాదేశ్ లో మాదక ద్రవ్యాల రవాణా, అక్రమ మానవ రవాణాకు పెట్టింది పేరు. ఇప్పుడు బంగ్లాదేశ్ ద్వారా బెంగాల్ గుండా ఇండియాలోకి యధేచ్ఛగా వస్తుంటాయి. దీంతో పాటు పాక్ తీవ్రవాదులు సైతం బంగ్లా నుంచి వయా బెంగాల్ ద్వారా భారత్ లోకి ప్రవేశిస్తారు.
ఒక పక్క భారత్ కు రక్షణ కొరవడటంతో పాటు, లక్షలాది మంది ఆ దేశ పౌరులు భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతారు. అయినా భవిష్యత్తులో ఏమైనా ఘర్షణలు జరిగితే మన శత్రు దేశాలకు అనుకూలంగా మన దేశంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారు. ఇప్పుడు బ్రిటన్, యూరప్ దేశాల్లో జరుగుతుంది మనం గమనిస్తున్నాం. శరణార్థులగా వచ్చిన వారు ఇప్పుడు అక్కడ తమ మత రాజ్యం కావాలని ఆందోళనలు, హింసలకు పాల్పడుతున్నారు.