ప్రపంచంలో పెద్దన్నగా చెలామణీ అవుతున్న దేశం అమెరికా. అనేక చిన్న దేశాలను ఇప్పటికే తమ చెప్పు చేతల్లో పెట్టుకుంది. మాట వినని దేశాల్లో ప్రభుత్వాలను కూల్చేసింది. తమ అనుకూల ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వారిని తమ సామంతులుగా మార్చుకుంది.


ఇరాక్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, పాకిస్థాన్, ఉక్రెయిన్, తాజాగా బంగ్లాదేశ్ లో కూడా అమెరికా జోక్యంతోనే ప్రభుత్వాలు కూలాయి. ఈ విషయాన్ని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనానే ఆరోపించడం గమనార్హం. ఇంధన వనరుల కోసం గల్ఫ్ దేశాల్లో చిచ్చు పెట్టింది. యూరప్ పై పట్టు కోసం రష్యాపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో ఉక్రెయిన్ ని పావుగా ఉండి దానిని వెనుక నుంచి నడిపిస్తోంది. ప్రపంచంలో మెజార్టీ దేశాలు అమెరికా మద్దతు పాలనలోనే సాగిస్తున్నాయి. తాజాగా ఆమెరికా బాటలోనే పయనిస్తోంది డ్రాగన్ దేశం.


బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా.. తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలను తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు  యత్నిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే శ్రీలంక లో ప్రభుత్వాన్ని కూల్చి వేసింది. అక్కడ రాజకీయ అస్థిరతను సృష్టించింది. ఇక వియాత్నంలోను జోక్యం చేసుకుంటుంది. తాజాగా బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కూలిపోవడం వెనుక పాకిస్థాన్ సాయంతో చైనా ఉందనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.


ఇక ఆసియా ఖండంలో చైనాకు ధీటుగా ఎదుగుతున్న దేశం భారత్ ఒక్కటే. ఇప్పుడు మన దేశాన్ని దెబ్బ కొట్టాలని భావిస్తోంది. ఇప్పటికే భారత్ తో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న చైనా.. ఇప్పుడు పాకిస్థాన్ తో కలిసి మన పై కుట్రలు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా భారత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు డ్రాగన్ కంట్రీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. బంగ్లాదేశ్ తరహాలో అల్లర్లు సృష్టించాలని ఇప్పటికే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. వాస్తవంగా బంగ్లాలో అల్లరు రిజర్వేషన్లు కోసం అయితే వాటి వెనుక పెద్ద కుట్రలు జరిపి ప్రభుత్వాన్ని మార్చేశారు. ఇప్పుడు ఇండియాలో కూడా అలాంటి అంశాలు అయిన ఎస్సీ వర్గీకరణ, అగ్నివీర్ రైతు ఉద్యమాలు వంటి వాటికి ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. మరీ మోదీ దీనిని ఎలా తిప్పి కొడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: