అందరూ ఊహించినట్లుగానే హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫాం హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాయి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఫాం హౌస్ కూల్చడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫాం హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. దాని కొలతలను తీసుకున్నారు. ఏ నిమిషంలో అయినా కూల్చివేతలు ప్రారంభం కావొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఉస్మాన్ సాగర్ లేక్ పరిధిలో ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ పరిమితులను ఉల్లంఘించి ఫాం హౌస్ ను నిర్మించుకున్నారని చాలా కాలంగా కేటీఆర్ పై ఆరోపణలు ఉన్నాయి. అయితే 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో దానిని టచ్ చేసే సాహసం ఎవరూ చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకోవడం. హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలను కూల్చి వేసేందుకు హైడ్రాను ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి.
ఇదిలా ఉండగా.. కేటీఆర్ ఇది నా ఫాం హౌస్ కాదు. నా మిత్రుడిది అని ప్రకటించారు. ఆక్రమణలు ఉంటే నేనే దగ్గరుండి కూల్చేయిస్తానని అని కూడా చెప్పారు. ఫాం హౌస్ ఓనర్ గా చెబుతున్న ప్రదీప్ రెడ్డికి కోర్టు నుంచి ఎలాంటి ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఫాం హౌజ్ ని ఏ క్షణం అయినా కూల్చేయవచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇక చేసేదేమీ లేకపోవడంతో ఆ ఫామ్ హౌజ్ లోని సామాన్ మొత్తాన్ని కేటీఆర్ అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం. లోపల ఇంధ్ర భవనంలా ఉండే అత్యాధునిక సదుపాయాలతో కూడిన చాలా సామాన్ ఉంది. ఆ సామగ్రి మొత్తాన్ని అక్కడి నుంచి మెదక్ జిల్లాకు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫాం హౌస్ లో పూచిక పుల్ల కూడా లేకుండా మొత్తం తరలించేశారు అని టాక్. ఇక కూల్చివేతకు కేటీఆర్ కూడా మానసికంగా సిద్ధమయ్యే ఖాళీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కోర్టు కూడా స్టేకి నిరాకరించిన తరుణంలో ఇక కూల్చివేతే మిగిలి ఉంది.