సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ రెండున్నర నెలల్లోనే ఏకంగా రూ.15 వేల కోట్ల అప్పులు చేసింది.


తాజాగా మంగళవారం 7.27శాతం వడ్డీతో రూ.3 వేల కోట్ల అప్పు చేసింది. 12 ఏళ్ల కాల పరిమితితో రూ. వెయ్యి కోట్లు, 17 సంవత్సరాల కాల పరిమితితో రూ.వెయ్యి కోట్లు, 22 ఏళ్ల కాలపరిమితితో మరో రూ.వెయ్యి కోట్లను చెల్లించేలా చంద్రబాబు సర్కారు అప్పు చేసింది.


సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. దీంతో చంద్రబాబు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రెండున్నర నెలల్లో మొత్తం అప్పు రూ.15 వేల కోట్లు చేసినట్లయింది. నిజానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి మంగళవారం అప్పు చేయనదే గడవదంటూ తప్పుపడుతూ ఎల్లో మీడియా నానా యాంగీ చేస్తూ కథనాలు రాసింది.


వాటి ఆధారంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ చంద్రబాబు అండ్ బ్యాచ్ తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రజల్లో ఒక రకమైన భావన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు అదే చంద్రబాబు కేవలం రెండున్నర నెలల కాలంలో రూ.15 వేల కోట్లు అప్పు చేసినా ఎల్లో మీడియా ఒక్క ముక్క వార్త కూడా రాయడం లేదు.


గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలు, పరిమితులు లోబడే అప్పులు చేసింది. అయినా సరే రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తున్నారు అంటూ అటు చంద్రబాబు, ఇటు ఎల్లో మీడియా కోడై కూసింది. ఇప్పుడు ఇంత అప్పు చేసినా పెన్షన్లు తప్ప మరే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. మరి ఈ అప్పులన్నీ దేనికి ఖర్చు చేసినట్లో మాత్రం తెలియరావడం లేదు. ఇదిలా ఉంటే అప్పులు చేయడం కాదు సంపద సృష్టిస్తా అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో అని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అసలు ఇప్పటి వరకు చేసిన అప్పులను ఏ అభివృద్ధి పనులకు వెచ్చించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: