ఏపీలో కుండపోత వర్షాలు ప్రజలను వణికించేస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అవుతున్నాయి. ఇలా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ నగరంలోని రోడ్లు జలమయాన్ని తలపించాయి.  ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించిపోయింది. ఈ సమయంలో మరికొన్ని గంటల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముప్పు పొంచి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏ క్షణంలో అయినా వరద చేరే అవకాశం ఉందని వైసీసీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది. కృష్ణానదికి భారీగా వస్తున్న వరదతో చంద్రబాబు ఇల్లు ప్రమాదం లో ఉందని వారు ప్రచారం చేస్తున్నారు. కరకట్ట, కృష్ణానది, మధ్యలో సీఎం చంద్రబాబు ఉన్నారు.



గతంలో వరద నీరు తన ఇంట్లోకి వచ్చేలా చేశారంటూ హడాదువడి చేశారని చంద్రబాబుపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.  ఇప్పుడు 5.83 లక్షలకు వరద చేరింది. అంటే గతం కంటే ఎక్కువ. ఇప్పటికే సీఎం నివాస ప్రాంగణంలోకి వరద నీరు చేరిందని వారు ఆరోపిస్తున్నారు. మరో 20 వేల క్యూసెక్కుల వరద వస్తే ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.  సీఎం నివాసంలోకి వరద చేరకుండా అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారంట. ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ పూర్తిగా ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు.


ఎప్పుడు లేనిది రికార్డు స్థాయిలో విజయవాడలో వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్కసారిగా నగరం మొత్తం వరదతో నిండిపోయింది. రోడ్లన్నీ చెరవులను తలపించాయి. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ సమయంలో ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లు ఎత్తడంతో అవుట్ ఫ్లో ఆరు లక్షల ఐదువేల క్యూసెక్కులు ఉండగా.. వరద ప్రవాహం 7 లక్షలు దాటితే కరకట్టవైపు నీళ్లు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలోని వాయుగుండం తీరం దాటింది.



మరింత సమాచారం తెలుసుకోండి: