కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి , కుమార్తెల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దాదాపు వారం పాటు మీడియాలో ఈ దువ్వాడ కుటుంబ కథా చిత్రం తీవ్ర అంశంగా మారిపోయింది.  ఈ నేపత్యంలో దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అంశంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది.


అవును.. ఇటీవల కాలంలో ఏపీలో అత్యంత తీవ్ర చర్చనీయాంశం అయిన అంశాల్లో దువ్వాడ కుటుంబం కథా చిత్రం ఒకటి. తనను తన పిల్లలను వదిలిపెట్టి ఆయన మరో మహిళతో ఉంటున్నట్లు దువ్వాడ శ్రీను భార్య వాణి, కుమార్తె సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమయంలో విడాకులే తమ విచిత్ర కథకు ముగింపు అని చెప్పుకొచ్చారు.


ఈ నేపథ్యంలో సెంటర్ పాయింట్ గా ఉన్న మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన కారుతో హైవేపై మరో వాహనాన్ని ఢీ కొట్టడం ఆమెను ఆసుపత్రికి తరలించడం అనంతరం డిశ్చార్జ్ అవ్వడం జరిగిపోయాయి.


అయితే అది ప్రమాదం మాత్రమే అని దాన్ని ఆత్మహత్యాయత్నంగా మార్చేలా దువ్వాడ శ్రీను ప్లాన్ చేశారనే అంశం తాజాగా తెరపైకి  వచ్చింది. తను ఆత్మహత్యాయత్నానికి కారణం దువ్వాణ వాణి అని చెప్పడం, ఆమె చేస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పడం దువ్వాడ శ్రీను స్ర్కిప్ట్ అని, వాణిపై మాధురి చేసిన ఆరోపణలు అంతా ఆయన డైరెక్షన్ లో జరిగాయి అంశం తాజాగా చర్చకు వచ్చింది.


లీకైన ఓ ఆడియోలో మాధురి తన కారు ప్రమాదం గురించి శ్రీనుతో మాట్లాడారు. తొలుత ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఆ తర్వాత ఈ ఆత్మహత్యాయత్నానికి కారణం దువ్వాణ వాణియేనని ఆమె వేధింపులు భరించలేకే దీనికి యత్నించినట్లు చెప్పమని శ్రీను మాధురికి చెప్పారు. ఆమె ఇదే విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ  ప్రమాదం సందర్భంగా మాధురిని ఎమ్మెల్సీ గైడ్ చేసిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: