హిమచల్ ప్రదేశ్ లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలపై హామీల వర్షం కురపించింది. తీరా ఎన్నికల్లో గెలిచాక… ఆర్థిక నష్టాల కారణంగా హామీలను అమలు చేయడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు హిమచల్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


దీని ద్వారా ఏడాదికి రూ.2వేల కోట్లు సమకూరుతాయి అని అంచనా వేసింది. అయితే హిమచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం గంజాయి సాగు చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం సూచన మేరకు రెవెన్యూ శాఖ మంత్రి జగ్ సింగ్ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యాన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు  చేశారు. తాజాగా కమిటీ నివేదిక శాసనసభలో ప్రవేశ పెట్టగా ఏకగ్రీవ ఆమోదం పొందింది.


దీనికి ప్రతిపక్ష బీజేపీ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇక ఔషధ, శాస్త్రీయ పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిక పద్ధతిలో గంజాయి సాగు చేపట్టాలని నిపుణులు బృందం ప్రతిపాదన చేసినట్లు మంత్రి నేగి తెలిపారు. గంజాయి సాగు సులభం కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని ప్రకటించారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు  చెప్పారు. గంజాయి సాగుకు అనుమతించేందుకు నార్కోటిక్ నిబంధనలను సవరించాలని నిపుణుల కమిటీ సూచించినట్లు చెప్పుకొచ్చారు.


ఈ కమిటీ హిమచల్ ప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోను పర్యటించి.. ఔషద, పారిశ్రామిక అవసరాల కోసం గంజాయి సాగును ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. అంతే కాకుండా జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు విజయవంతం అయిన నమూనాలను కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే హిమచల్ ప్రదేశ్ లో గంజాయి సాగకు చట్టబద్ధత కల్పించినట్లు నేగి స్పష్టం చేశారు. అయితే గంజాయిని మాదక ద్రవ్యంగా కాకుండా పలై ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: