ఒకప్పుడు వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా ఉందో గత పదేళ్లుగా చూస్తున్నాం. మోదీ ఎంట్రీతో మారిన సమీకరణాలు ఓ వైపు… వయసు మీద పడిన సోనియమ్మ మరోవైపు.. అతి పెద్దదైన పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఏదైనా సమస్య వచ్చిందంటే తీర్చే నాథుడే లేకుండా పోయారు. గతంలో పెద్ద తలకాయలు భారీగా ఉండటమే కాదు.. విసయం ఏదైనా ఇట్టే ఎంట్రీ ఇచ్చి సమస్యను సాల్వ్ చేసేవాళ్లు.


కాల క్రమంలో వారంతా పెద్దవాళ్లు అయిపోవడం.. కొత తరహాలో అలాంటి వారు రాకపోవడం ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితికి కారణాలు. ఈ మధ్యే ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ గా పేరొందారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్. పని ఏదైనా.. టాస్క్ ఇచ్చి పంపిస్తే చాలు లెక్కలు తెల్చేసే రకం. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టిన చందంగా దక్షిణాదిలోని కర్నాటక, తెలంగాణాల్లో పార్టీ అధికారంలో ఉందంటే అది ఈయన పుణ్యమనే చెప్పాలి. అలాంటి డీకే ఇప్పుడు పార్టీ ఖంగుతినేలా చేశారు.


ఇటీవల దిల్లీ వెళ్లిన ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు.. ప్రధాని మోదీని కలవడం పార్టీ అధినాయకత్వానికి షాక్ తగిలేలా చేసింది. ముడా ఇంటి స్థలాల వివాదంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం తెలిసిందే. ఈ అంశంపై దిల్లీ పెద్దలకు వివరణ ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎం డీకేలు దిల్లీ వెళ్లారు.


ఈ సందర్భంగా డీకే మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సొంత పార్టీ సీఎంలకే టైం ఇవ్వని మోదీ.. డీకేకే సమయం ఇవ్వడం ఏంటన్నది బీజేపీతో పాటు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం డీకేను వివరణ కోరగా.. పలు డెవలప్ మెంట్ అంశాల మీదనే పీఎం ను కలిశానని.. రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారంట. ఇదిలా ఉండే రాహుల్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండగా.. డీకే సైతం అక్కడికి వెళ్లి యువరాజుని కలిశారు. మొత్తానికి కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ కాస్తా ట్రబుల్ అయ్యాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: