పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన దగ్గర నుంచి జనసేన క్యాడర్ హుషార్ మామూలుగా లేదు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని స్టిక్కర్లు తమ బైకులకు అతికించుకొని తెగ జోరు చేశారు. అదే సమయంలో వారు అంతా ఆ బైకులతోనే ఊరూరా తిరిగి సందడి చేశారు. అది ఎంత దాకా వచ్చింది అంటే పవన్ కల్యాణే స్వయంగా పిఠాపురం వచ్చి రూల్స్ బ్రేక్ చేయొద్దు లా అండ్ ఆర్డర్ ని మనమే గౌరవించాలి అని చెప్పేంత వరకు.


ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం వరకు ఎదిగారు.  అయితే ఆయన కేవలం పిఠాపురానికే మంత్రిలా వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. గతంలో జనసేన లో కీలక నేతగా ఉన్న పోతిన మహేశ్ టికెట్ దక్కలేదని వైసీపీ లో చేరారు. ఇప్పుడు జనసేన అధినేతపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.


తాజాగా ఆయన బెజవాడ వరద నీటిలో మునుగుతుంటే.. పవన్ అక్కడ పర్యటించలేదని విమర్శించారు. అదేమని అడిగితే తాను వస్తే సహాయ చర్యలకు ఇబ్బంది అవుతుందని చెప్పారని గుర్తు చేశారు. అంతే కాదు జనాలు ఎగబడి వస్తారు అని కూడా చెప్పారని అన్నారు. మరి పిఠాపురంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు సహాయ చర్యలకు ఇబ్బంది కలగదా అని ఆయన ప్రశ్నించారు.


పవన్ ఈ విధంగా చేసినందుకు విజయవాడ ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు అని విమర్శించారు. ఇదిలా ఉండగా.. పోతిన మహేశ్ అన్నారు అని కాదు కానీ..  బెజవాడలో పవన్ ఎందుకు పర్యటించలేదు అనే దానికి జనసేనాని చెప్పిన కారణం మాత్రం కన్విన్సింగ్ గా లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ పిఠాపురంలో మోకాళ్ల లోతు నీటిలో కూడా దిగి పర్యటించారు. జగనన్న కాలనీల్లో బోటు ప్రయాణం చేశారు. ఇవన్నీ విజువల్స్ గా బయటకు వచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం మీద ట్రోలింగ్ మొదలైంది. ఒక విధంగా పవన్ ఇరకాటంలో పడ్డారా లేక.. ఆయన్ని అలా పడేశారా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: