ఉక్రెయిన్ రష్యా ల మధ్య యుద్ధం ప్రారంభం అయి మూడుళ్లు కావొస్తోంది. అయినా ఇప్పటికి ముగింపు అనేది రాలేదు. పైగా రెండు దేశాల మధ్య సమస్య ఇంకా తీవ్రం అవుతోంది. ప్రస్తుతానికి రష్యా, ఉక్రెయిన్ పై మిస్సైల్స్ తో విరుచుకుపడుతుండగా… ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేస్తోంది. ఈ సమయంలో జెలెన్ స్కీ ప్రభుత్వం పోరాటాన్ని తీవ్రతరం చేస్తోంది. ఈ ఉద్దేశంతోనే తన రూటును మార్చుకున్నట్లు తెలుస్తోంది.


దీంట్లో భాగంగానే రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ అత్యాధునిక మిస్సైల్స్ ను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ దేశానికి చెందిన స్టార్మ్ షాడో క్రూజ్ మిస్సైల్స్  ను ఉక్రెయిన్ కు అందించేందుకు ఆమోదం తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే రష్యా భూభాగంపై పాశ్చాత్య దేశాలకు చెందిన ఆయుధాలు వాడటంపై ఒక పరిమితి అనేది ఉంది. కాగా ఈ ఆయుధాలును స్టార్మ్ మిస్సైల్స్ ఉక్రెయిన్ కు వాడటానికి అనుమతి ఇస్తే పాశ్చాత్య దేశాలు తమ దేశంతో నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరికలు కూడా జారీ చేశాడు.


స్టార్మ్ షాడో అనేది బ్రిటీష్ పేరు కాగా.. ఫ్రాన్స్ ఈ మిస్సైల్ ని scalp-eg అనే పేరుతో పిలుస్తోంది. ఈ మిస్సైల్ ని 1994 లో మాత్ర అండ్ బ్రిటీష్ ఏరో స్పేస్ అభివృద్ధి చేసింది. ఇది ఒక దీర్ఘ శ్రేణి క్రూజ్ మిస్సైల్. దీనిని బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.


స్టెల్త్ టెక్నాలజీ తో రూపొందించిన ఈ మిస్సైల్స్ ను గాలిలో నుంచి ప్రయోగిస్తారు. ఇది 150 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం చేధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే దీనిని యూఎస్ఎస్ఆర్ కు చెందిన ఎస్ యూ-24 బాంబర్లతో సహా ఉక్రెయిన్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే వీలుంది. ఇదిలా ఉండగా ఈ మిస్సైల్స్ ఇతర దేశాలకు ఇవ్వడంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే వీటిని ఉక్రెయిన్ ఉపయోగిస్తే.. రష్యా నుంచి స్పందన రెట్టింపు ఉండొచ్చని వీలైతే రష్యా అణ్వాయుధాలను సైతం ప్రయోగించే వీలుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: