అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెడిడెన్షియల్ డిబెట్ విజయానికి హామీగా పరిగణిస్తారు. ప్రెసిడెంట్ డిబెట్ లో గెలిచిన అభ్యర్థికే ఎన్నికల ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇప్పటి వరకు జరిగిన అధ్యక్ష చర్చల గణాంకాలు కూడా ఈ వాదనను బలపరుస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 13 ప్రెసిడెన్షియల్ డిబేట్ లలో 10 డిబెట్ లో గెలిచిన వ్యక్తే విజేతగా నిలిచారు.
ప్రెసిడెన్షియల్ డిబెట్ లో ఓడినా అభ్యర్థి కేవలం మూడు సార్లు మాత్రమే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. విశేషం ఏంటంటే.. చర్చలో ఓడిపోయినా.. ఎన్నికల్లో గెలిచిన వారిలో ట్రంప్ పేరు కూడా చేరిపోయింది. 2016లో డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై ప్రెసిడెన్షియల్ డిబెట్ లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించారు.
ట్రంప్ తో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్బ్ డబ్ల్యూ బుష్ కూడా అధ్యక్ష ఎన్నికల చర్చలో ఓడిపోయినా.. రెండు సార్లు విజయం సాధించారు. 2016లో రిపబ్లికన్ , డెమొక్రటిక్ అభ్యర్థులు మూడు ప్రెసిడెంట్ డిబెట్ లో పాల్గొన్నారు. మొదటి డిబెట్ తర్వాత నిర్వహించిన అన్ని సర్వేల్లోను ట్రంప్ కంటే హిల్లరీ నే చాలా మందంజలో ఉన్నారు. ఓ పోల్ లో హిల్లరీ క్లింటన్ కు 62శాతం మంది, డోనాల్డ్ ట్రంప్ ని 27 శాతం మంది విజేతలుగా పరిగణించారు.
ఫాక్స్ న్యూస్ సర్వేలో హిల్లరీ క్లింటన్ డిబేట్ లో గెలిచారని 61 శాతం మంది విశ్వసించగా.. డొనాల్డ్ ట్రంప్ గెలిచారని.. 21 శాతం మంది మాత్రమే నమ్మారు. రెండో చర్చ తర్వాత కూడా హిల్లరీ క్లింటన్ విజయం దేశంలోని అన్ని ప్రధాన పార్టీల్లోను కనిపించింది. కానీ అనూహ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు.
ఇప్పుడు కమలా హారిస్ ట్రంప్ మధ్య టిబెట్ ఆతిథ్యం ఇచ్చిన ఏబీసీ న్యూస్ సర్వే 52 శాతం మంది హిల్లరీ క్లింటన్ ని విజేతగా పరిగణించగా.. 29శాతం మంది ట్రంప్ విజయం సాధిస్తారని చెప్పారు. మరి ఈ సారి కూడా 2016 ఫలితాలే పునరావృతం అవుతాయనే గట్టి నమ్మకంతో ట్రంప్ ఉన్నారు. ఏం జరగుతుందో చూడాలి.