ఏపీలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ ఏ స్థాయిలో వివాదాస్పదం అయిందో మనకి తెలిసిందే. భారీగా ధరలు పెంచడం వల్ల మద్యపాన వినియోగం తగ్గుతుందనే ఆలోచనలు అప్పట్లో వినిపించాయి. అయితే మరోపక్క అది కాస్తా సామాన్యుడి నడ్డి విరిచిందనే చర్చ జోరుగా సాగింది.


ఈ సమయంలో తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని టీడీపీ ప్రకటించింది. ఈ క్రమంలో చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశ పెట్టింది. తాజాగా నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.


సీఎం చంద్రబాబు అధ్యక్షతన సాగిన ఏపీ కేబినెట్ సమావేశంలో నూతన మద్యం విధానానికి సంబంధించి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో సగటు మధ్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.  ఇదే క్రమంలో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను కొనసాగించాలని నిర్ణయించింది.


రాష్ట్రంలోని 3736 మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు పది శాతం అంటే 340 దుకాణాలను కేటాయించాలనే కమిటీ సిఫార్సుకు సమ్మతి తెలిపింది. రాష్ట్రంలొఓ 12 ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తిరుపతిలో మాత్రం ప్రీమియర్ దుకాణానికి అనుమతి ఇవ్వలేదు.


కొత్త మద్యం విధానం అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఇది రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. కొత్త పాలసీలో భాగంగా ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయించారు. లాటరీ విధానంలో వీటిని కేటాయించనున్నారు. రిజర్వుడు దుకాణాలకు మాత్రమే ప్రత్యేకంగా మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు వేయనున్నారు.


అన్ రిజర్వుడు దుకాణాలకు ప్రతిపాదించే లైసెన్స్ ఫీజుల్లో 50శాతమే రిజర్వుడు దుకాణాలకు ఉంటుంది. లైసెన్స్ ఫీజును నాలుగు శ్లాబుల్లో రూ.50 నుంచి 85 లక్షల వరకు ఉంటుంది. ప్రాఫిట్ లో 20 శాతం మార్జిన్. ప్రీమియం దుకాణాలకు లైసెన్స్ కాలపరిమితి ఐదేళ్లు. ఫీజు రూ. కోటి.

మరింత సమాచారం తెలుసుకోండి: