సరిగ్గా రెండేళ్ల క్రితం శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరూ చూశారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో సాక్షాత్తూ దేశాధినేతనే పారిపోవాల్సి వచ్చింది. సాధారణ పౌరుడు అధ్యక్షుడి నివాసంలోకి వచ్చి.. ఇష్టారీతిన వ్యవహరించారు. అధ్యక్షుడి పాలనపై తనకు ఉన్న ఆగ్రహాన్ని చాటి చెప్పారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అలాంటి దేశంలో ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే చరిత్రలో ఎన్నడూ లేనంతగా మలుపులు చోటు చేసుకుంటున్నాయి.


బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ తర్వాత ఉప ఖండంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న దేశం శ్రీలంక. అయితే అక్కడ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఏ అభ్యర్థికి అయినా విజయానికి యాభై శాతం ఓట్లు అవసరం. అవి ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కింపు చేపట్టి నిర్ధారించారు.


లంకలో ఇప్పటి వరకు ప్రేమ దాసలు, రాజపక్సేల పాలన చూశారు. కానీ ఈ సారి గాలి వామపక్షాల వైపు మళ్లింది. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో మార్కిస్ట్ నాయకుడు, నేషనల్ పీపుల్స్ పవన్ అభ్యర్థి అనుర కుమార దిసనాయకే దూసుకెళ్లారు. ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీ పడినా.. మొదటి నుంచి మొగ్గు ఈయన వైపే కొనసాగుతుంది. దిసనాయకే ఆధిక్యంలో కొనసాగారు.


మొదటి రౌండ్ లో ఆయన 39.52 శాతం ఓట్లు సాధించారు. ప్రతి పక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాస 34.28 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరూ టాప్-2 లో ఉన్నప్పటికీ విజయానికి అవసరం అయిన 50శాతం ఓట్లు ఎవరూ సాధించలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు.


దిసనాయకేకు 42శాతం పైగా ఒఓట్లు దక్కాయి. లంకలో మొత్తం 1.7 కోట్ల మంది నమోదిత ఓటర్లలో 75శాతానికి పైగా ప్రజలకు ఆయనకే ఓటు వేశారు. దిసనాయకే, విక్రమసింఘె, విపక్షనేత సాజిద్ ప్రేమదాస మధ్య ఈసారి త్రిముఖ పోరు నెలకొంది.

లంఖ అధ్యక్ష ఎన్నికల్లో రెండో రౌండ్ ఓట్లు లెక్కించడం ఇదే మొదటి సారి. ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్య ఓట్లతోనే విజేతలు ఖరారయ్యారు. కానీ తొలిసారిగా దిసనాయకే రెండో ప్రాధాన్యత ఓట్లతో లంక అధ్యక్షుడు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: