హెజ్ బొల్లా  చీఫ్‌ గా నస్రల్లా బయటి ప్రపంచానికి కనిపించడు. అతడు బయటకు రావడమే చాలా అరుదు. పైగా హెజ్ బొల్లా   ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హెజ్ బొల్లా   అనేది లెబనాన్ ప్రాంతానికి చెందిన సంస్థ. 1980లో లెబనాన్ లో అంతర్యుద్ధం జరిగింది. ఆ సమయంలోనే ఈ మిలిటెంట్ గ్రూప్ ఆవిర్భవించింది. అనంతరం ఇరాన్ అండదండలు అందించడంతో అందనంత ఎత్తుకు ఎగిరింది.


ప్రపంచంలో ఏ ఉగ్రవాద సంస్థకు లేనటువంటి ఆయుధాలు, ఆర్థిక వనరులు ఈ సంస్థకు ఉన్నాయి. ఈ సంస్థ వద్ద లక్ష రాకెట్లు ఉన్నాయి. 50 వేల నుంచి లక్ష వరకు అన్ని రంగాల్లో శిక్షణ పొందిన ఫైటర్లు ఉన్నారు. అందువల్లే హెజ్ బొల్లా   పదే పదే ఇజ్రాయెల్ దేశంపై దాడులు చేయడం మొదలు పెట్టింది.



ఇక గత అక్టోబరులో ఇజ్రాయెల్ లపై హమాస్ దాడి చేసింది. ఆ దాడులు అనంతరం పాలస్తీనాకు సంఘీభావంగా నిత్యం ఇజ్రాయెల్ దేశంపై రాకెట్లను వదిలేది. అయితే కొద్ది రోజులు క్రితం హెజ్ బొల్లా  గ్రూపు వదిలిన ఒక రాకెట్ ఇజ్రాయెల్ లోని ఒక పాఠశాలపై పడింది. ఈ ఘటనలో 12 మంది చిన్నారులు చనిపోయారు. అప్పటి నుంచి హెజ్ బొల్లా  ను ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం మొదలు పెట్టింది.


అప్పటి నుంచి నస్రల్లా అత్యంత జాగ్రత్తగా ఉంటున్నాడు. అయితే ఇజ్రాయెల్ నిఘా విభాగం అత్యంత బలమైంది. కాగా నస్రల్లా బయట ప్రపంచానికి పెద్దగా కనిపించడు. వీడియెలు, ఇతర మార్గాల ద్వారా సందేశాలు ఇస్తాడు. 32 ఏళ్ల నుంచి హెజ్ బొల్లా   సారథిగా ఉంటున్నాడు. అతడు బీ రూట్ లోని అతిపెద్ద భవనాల కింద ఏర్పాటు చేసిన సెల్లార్లలో నివాసం ఉంటాడని తెలిసింది. దీంతో అమెరికా తయారు చేసిన బంకర్ బస్టర్ బీబీయూ 28ని ఇజ్రాయెల్ కొనుగోలు చేసి దానిని బీరూట్ పై నస్రల్లా ఉండే భవంతులపైకి వదిలింది. ఈ ప్రమాదంలో నస్రల్లా దుర్మరణం చెందాడు. అయితే ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఙానం హమాస్ కు తెలుసు కాబట్టి.. జాగ్రత్తగా వ్యవహరించింది. కానీ హెజ్ బొల్లా   ముందు చూపు లేకుండా దాడులు చేయడంతో ఇజ్రాయెల్ చేతికి చిక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: