నాయకులు అహంకారంతో ప్రవర్తిస్తే దేశ ప్రజలు సహించరు అని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు సిద్ధమైన నేపథ్యంలో.. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంపైనా పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



నాయకులు అహంకారాన్ని దేశ ప్రజలు సహించరు. ఎన్నికల సమయంలో కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు. అయితే నేను చేసిన ఈ వ్యాఖ్యలు ఏ నేతను లక్ష్యంగా చేసుకొని అంటున్నవి కాదు. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ప్రతిపక్ష నేతగా రాహుల్ సమర్థంగా వ్యవహరించగలరని ఆ పార్టీ మద్దతు దారులు విశ్వసించారు. అయితే ఈ విషయంలో మరో కోణం కూడా ఉంది.


ఆయన్ను దేశమంతా నాయకుడిగా అంగీకరించారా? అంటే నేనైతే అలా అనుకోవడం లేదు అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అడిగిన ప్రశ్నకు పీకే స్పందిస్తూ.. ప్రధాని మోదీ పేరు కనిపిస్తే ఓట్లు పడతాయని బీజేపీ భావించింది. కానీ గతంలో పోలిస్తే ఈ సారి ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీ మెజార్టీలో తగ్గుదల కనిపించింది.


ఎన్నికల ముందు కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమించారు. ఆయన నాయకత్వంపై సొంత పార్టీలో ఉన్న అనుమానాలు తొలగించారు. దీంతో కాంగ్రెస్ ను ముందుకు తీసుకెళ్లగలరనే నమ్మకం వారిలో కలిగింది అని పీకే వ్యాఖ్యానించారు. ఇదిలా  ఉండగా హరియాణా, కశ్మీర్  లో కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి.  కిశోర్ కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. పార్టీ పేరు, నాయకత్వం సహా ఇతర వివరాలను గాంధీ జయంతి సందర్భంగా ప్రకటించనున్నారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో ఉండదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: