దేశంలో 4G నెట్ వర్క్ ను నిర్మించిన నాటి నుంచి కేవలం సబ్ స్క్రైబర్స్ ను రాబట్టుకోవడమే కానీ పోగొట్టుకోవడం తెలియని రిలయన్స్ జియో, మొదటి సారిగా కోటి మంది సబ్ స్క్రైబర్స్ ను కోల్పోయింది.

ఉచిత 4G మరియు 4G డేటా రేటుకే అన్లిమిటెడ్ 5g డేటా వంటి ఆఫర్లతో ఇతర కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జియో, ఇప్పుడు సొంత కస్టమర్లను కోల్పోతుంది. ఇటీవల జియో పెంచిన టారిఫ్ రేట్ల తర్వాత ఈ చర్య జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.


జూలై లో జియో టారిఫ్ రేట్లు 12 నుంచి 25 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ను ను సరి చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జియో అప్పట్లో తెలిపింది.  పెరిగిన రేట్ల దెబ్బకు కకావికలమైన చాలా మంది బడ్జెట్ యూజర్లు సొంత గూటిని వదిలి ఇతర నెట్ వర్క్ లకు వెళ్లిపోయారు.



టారిఫ్ రేట్స్ పెరిగిన తరువాత ముందుగా ఉన్న 181.7 యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ను ఇప్పుడు జియో రూ. 195.1 గా నమోదు చేసింది. అంతేకాదు, పెరిగిన లాభాలతో 6,536 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించినట్లు కూడా ప్రకటించింది. ఇది మాత్రమే కాదు 130 మిలియన్ సబ్ స్క్రైబర్స్ నుంచి 147 మిలియన్ సబ్ స్క్రైబ్ స్క్రైబర్స్ కు జియో జంప్ చేసినట్లు కూడా అనౌన్స్ చేసింది.


అయితే, ఓపెన్ సిగ్నల్ కొత్తగా అందించిన ఒక నివేదిక మాత్రం గడిచిన మూడు నెలల్లో 1 కోటికి మందికి పైగా సబ్ స్క్రైబర్స్ ను జియో చేజార్చుకున్నట్లు తెలిపింది. అయితే, ఇదే రిపోర్ట్ లో ఇప్పటికీ 44.2 Mbps డౌన్ లోడ్ స్పీడ్ తో జియో మొదటి స్థానంలో ఉన్నట్లు కూడా తెలిపింది. 147 మిలియన్ సబ్ స్క్రైబర్స్ తో ఉన్న జియో నెట్ వర్క్ లో 1 కోటి మంది అంటే, 10 మిలియన్ సబ్ స్క్రైబర్స్ పెద్దగా లోటుగా కనిపించక పోవచ్చు. కానీ, రేట్ల గురించి యూజర్లకు అసహానికి గురైనట్లు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: