షర్మిల లేఖ రాసినప్పుడు విపరీతంగా స్పందించిన వైసీపీ, సాక్షి.. ఇప్పుడు విజయమ్మ లేఖాస్త్రం పై కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నాయి.

ఏకంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం విజయమ్మ కుట్ర పన్నుతున్నారని సాక్షి ఆరోపించింది.  ఆ లేఖలో జగన్ బెయిల్ రద్దు అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది.. వాస్తవానికి నాలుగు గోడల మధ్య ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉండగా.. ఎన్సీ ఎల్టీ దాకా తీసుకెళ్లడం సరికొత్త వివాదాలను రేకెత్తిస్తోంది.


ఈ వ్యవహారం వైయస్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.. సామాజిక మద్యమాలలో వారు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు..” జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల, విజయమ్మ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. షర్మిల పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిలకు జగన్ సముచిత ప్రాధాన్యం కల్పించలేదు.. ఇప్పుడు ఆస్తుల వివాదం తెరపైకి వచ్చింది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు.


ప్రస్తుతానికి అయితే పార్టీ పరువు పోతోంది. ఇప్పటికైనా ఈ సమస్యను వారు పరిష్కరించుకోవాలని వైఎస్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆస్తుల వివాదంలో విజయమ్మ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఇది వైసిపి కి షాక్ కలిగించింది. దీంతో సాక్షి రెచ్చిపోయింది. ఏకంగా విజయమ్మ తీరును విమర్శిస్తూ ఒక పేజీ మొత్తం కథనాలను ప్రచురించింది. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు గురైనప్పుడు విజయమ్మ రోడ్లమీదకి వచ్చారు. ఆందోళన చేశారు. జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ములాఖత్ సమయంలో చెప్పినట్టు విజయం చేశారు.


శాసనసభలో బొత్స సత్యనారాయణ తో కూడా నానా మాటలు పడ్డారు. అయితే అలాంటి విజయమ్మను సాక్షి విమర్శించింది. సాక్షి అలా రాసింది అంటే, జగన్ సమ్మతం లేకుండా ఉండదు. మొత్తంగా చెప్పాలంటే ఆస్తుల వివాదంలో జగన్.. షర్మిల, విజయమ్మతో యుద్ధాన్నే కోరుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు కాని.. ప్రస్తుతం అయితే ఆస్తుల వివాదం జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో సరికొత్త చిచ్చు రేపింది. ఆయనను చెల్లికి, తల్లికి దూరం చేసింది. మొత్తంగా చూస్తే జగన్ ఏకాకి అయిపోయారని.. త్వరలోనే ఆయన కేసుల ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారని తెలుస్తోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: