తెలంగాణలో దీపావళి నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇంటి పథకాన్ని కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.


ఈ పథకానికి సొంత స్థలం కలిగిన పేద కుటుంబాలు అర్హులు. మొత్తం నాలుగు దశల్లో ఇళ్ల కేటాయింపు జరుగుతుంది. దీనిలో మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయిస్తుంది. ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్పష్టతతో ఉంటుంది. ఇక సొంత స్థలం ఉన్నవారికి ప్రభుత్వం రూ.5 లక్షల సాయం అందిస్తుంది. ఇది దశలవారీగా చెల్లింనున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటి యజమానిగా మహిళనే గుర్తిస్తారు.


ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇంటి నిర్మాణానికి అర్హత పొందేందుకు అభ్యర్థులు ఈ ప్రమాణాలు పాటించాలి. అప్పుడే అర్ములు అవుతారు. దరఖాస్తు దారుడు భారతీయుడై ఉండాలి. లబ్ధిదారు పేరుమీద రిజిస్ట్రర్‌ స్థలం ఉండాలి. ఇతర ప్రభుత్వ గృహ పథకాల లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు క ఆదు. లబ్ధిదారుల ఆదాయ పరిమితి నిబంధనల మేరు ఉండాలి.


ఇందిరమ్మ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నిండాలి. దీనితపాట ఇంటి యజమానిగా గుర్తించబడే ఆ కుటుంబంలోని మహిళనే. ఇక ఇందిరమ్మ పథకానికి దరఖాస్తులకు కొన్ని పత్రాలు కూడా సమర్పించాలి. ఆధార్‌ కార్డు: దరఖాస్తుదారుడి గుర్తింపు కోసం.


1, సొంత స్థలం ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేవారు సొంత స్థలం ఉందని రుజువు చేయడానికి రిజిస్ట్రేషన్‌ పత్రాలు అవసరం.

2. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పకుండా ఉండాలి.

3. ఇక ఆదాయ ధ్రువీకరణ కోసం కుటుంబాన్ని ఆదాయ నిర్ధారిస్తుంది.

4. దరఖాస్తుతోపాటు ఓ పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో జత చేయాలి.


మండల కార్యాలయంలో లేదా పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలి. అప్లికేషన్‌ పత్రాలు పొందాలి. దరఖాస్తులో వివరాలు నింపి పత్రాలు జోడించాలి. పూరించిన దరఖాస్తులను సంబంధిత అధికారి కార్యాలయంలో అందించాలి.


పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి పేద కుటుంబాలు, సొంత స్థలం కలిగినవారు అర్హులు . కనీసం 18 ఏళ్లు నిండినవారు మాత్రమే పథకానికి అర్హులు. ఆధార్‌ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, భూమి పత్రాలు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు అవసరం. ఈ ఇంటిని కుటుంబంలో మహిళ యజమానిగా గుర్తిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: