ఏపీలో శాంతిభద్రతల పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన పవన్ ఆ శాఖను తీసుకుంటానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నీరు గారి పోయిందని ఆరోపించిన సంగతి విధితమే. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు పవన్. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబుతో పాటు తనపై పోలీసు వ్యవస్థతో ఆడుకున్నారని గుర్తు చేశారు. దీనిపై హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పవన్ సూచనలను తప్పకుండా తీసుకుంటామని.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తామని చెప్పుకొచ్చారు.
అదే సమయంలో వైసీపీ కూడా స్పందించింది. కూటమిలో విభేదాలు ప్రారంభమయ్యాయని చెబుతోంది. పవన్ కామెంట్స్ పై రాష్ట్ర డీజీపీ ద్వారకాతిరుమల స్పందించారు. పోలీస్ శాఖ రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటుందని.. ప్రజాస్వామ్యంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా కొన్ని తప్పులు జరిగాయని.. దానికి ఒప్పుకుంటున్నామని కూడా చెప్పారు. అప్పట్లో జరిగిన తప్పులు సరిదిద్దడం పై దృష్టి పెట్టామని కూడా వివరించారు. అనంతపురం పర్యటనలో ఉన్న డీజీపీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించడం విశేషం.
రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీస్ శాఖ సక్రమంగా పనిచేయలేక పోతుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. మావాడు, మా కులం వాడు, మా రక్తం వాడు అంటూ నిందితుడిని కొమ్ముకాసే వ్యవస్థ ఉన్నంతవరకు నిందితులు రెచ్చిపోతుంటారని పవన్ గుర్తు చేశారు. బిజెపి పవన్ అభిప్రాయంతో ఏకీభవించారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ లు సరిగ్గా విధులు నిర్వహించిన విషయాన్ని కూడా ఒప్పుకున్నారు. ఓ పార్టీ కార్యాలయం పై దాడి జరిగితే బాధ్యతగా వ్యవహరించలేదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల దాడి జరిగిందని అప్పట్లో పోలీసులు కేసును నీరుగార్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు డీజీపీ.
ఏపీలో శాంతిభద్రతలపై పవన్ మాట్లాడిన తర్వాతే పోలీస్ వ్యవస్థ పనితీరుపై చర్చ ప్రారంభం అయ్యింది. వైసీపీ హయాం నుంచే పోలీసు వ్యవస్థ నీరు గారి పోయిందన్న విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. అదే విషయాన్ని డీజీపీ ప్రస్తావించారు. పవన్ హెచ్చరికల తర్వాత హోంశాఖ తో పాటు పోలీస్ వ్యవస్థ అప్రమత్తం కావడం విశేషం.