ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అయిన వైసీపీలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. వైసీపీలో ఎవరు ఉన్నారో ఎవరు లేరో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలో వైసీపీలో నుంచి బయటకు వెళ్లేవారు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది వివిధ కారణాలు చెప్పి పార్టీని వీడిపోయారు.
అదే బాటలో మరికొందరు పయనిస్తున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీలో దిగ్గజ నేతలుగా చెప్పుకునే వారు అంతా పార్టీని వీడిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు పుకార్లుగా షికారు చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు వైసీపీ గేటు దాటనున్నారు అన్నది తాజాగా వైరల్ అవుతున్న మరో న్యూస్ ఎందుకు ఇలా జరుగుతోంది, అసలు వైసీపీకి ఏమి జరిగింది. ఏమి జరగబోతోంది అన్నది కనుక చూస్తే చాలా ఆసక్తిని పెంచేలాగానే సంఘటనలు జరుగుతున్నాయి
మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ దెబ్బకు వైసీపీ నేతలు హడలిపోతున్నారు అని అంటున్నారు. వైసీపీ నేతలను ఏ మాత్రం స్పేర్ చేయకూడదని పవన్ పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. గతంలో టీడీపీని జనసేన నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు చకచకా సాగిపోతున్నాయి. ఇపుడు బిగ్ షాట్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు.
వైసీపీ ఏలుబడిలో అక్రమంగా ఆస్తులు సంపాదించిన పలువురు మాజీ మంత్రుల విషయంలోనే గట్టి టార్గెట్ ఉంటుందని అంటున్నారు. దీంతో విషయం పసిగట్టిన ఆరుగురు వైసీపీకి చెందిన మాజీ మంత్రులు బీజేపీలోకి జంప్ చేయడం ద్వారా తమను తాము రక్షించుకోవడానికి చూస్తున్నారు అని అంటున్నారు.
ఈ మేరకు వీరంతా బీజేపీ పెద్దలకు టచ్ లోకి వెళ్లారు అని అంటున్నారు. ఈ క్రమంలో వీరిని చేర్చుకునే విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సుముఖంగా ఉందని అంటున్నారు. వీరిని ఢిల్లీ పిలిపించి ఒకేసారి కమలం పార్టీ కండువాలు కప్పించే కార్యక్రమం చేపడతారు అని అంటున్నారు.
వీరిలో ఎక్కువ మంది కోస్తా జిల్లాలకు చెందిన వారు ఉన్నారని అంటున్నారు. గతంలో వైసీపీ నుంచి పెద్ద గొంతుక చేసి విమర్శలు చేసిన వారిలో వీరు ముందు వరసలో ఉంటారని అంటున్నారు. వీరు కనుక వైసీపీని వీడితే ఆ పార్టీకి భారీ దెబ్బ పడుతుందని అంటున్నారు.